దెబ్బకు దెబ్బ... కాశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం...

ఎవరితో పెట్టుకున్నా సైన్యంతో పెట్టుకోకూడదు. ముఖ్యంగా మన ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే... ప్రాణాలు పోయినట్లే అని మరోసారి నిరూపించింది మన ఆర్మీ.

news18-telugu
Updated: May 6, 2020, 12:16 PM IST
దెబ్బకు దెబ్బ... కాశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం...
దెబ్బకు దెబ్బ... కాశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం... (credit - twitter)
  • Share this:
భారతీయులు గర్వించే సందర్భాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ఇది అలాంటిదే. ఇటీవలే రెండు సందర్భాల్లో మన సైన్యం ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు... ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూకాశ్మీర్... పుల్వామా జిల్లా... అవంతిపురలో... జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సస్థ టాప్ కమాండర్ రియాజ్ నైకూను సైన్యం లేపేసింది. భారత సైన్యానికి ఇదో భారీ విజయం కింద లెక్క. ఆ పనికిమాలిన రియాజ్ నైకూ... కాశ్మీర్ లోయలో తిరుగుతూ... స్థానికుల్ని కిడ్నాప్ చేస్తూ... బలవంతంగా ఉగ్రవాద రిక్రూట్‌మెంట్లలో చేర్చుతున్నాడు. కొన్నేళ్లుగా ఇండియన్ ఆర్మీకి తలనొప్పిలా తయారయ్యాడు. రాత్రి మొదలైన ఎన్‌‌కౌంటర్‌లో నైకూ బాడీ గార్డ్ కూడా హతమైనట్లు తెలిసింది.

బెయిగ్‌పుర నుంచి ఎవరో ఉగ్రవాదులు ఉన్న విషయం లీక్ చేశారు. అవంతిపురలోని షార్షాలీ క్ష్ర్యూ ప్రాంతంలో... CRPF, ఇండియన్ ఆర్మీ, కాశ్మీర్ పోలీస్ ఛలో అంటూ మంగళవారం రాత్రి ఆపరేషన్ మొదలుపెట్టారు. ముందుగానే... మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను కాశ్మీర్ లోయలో ఆపేశారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి... ఉగ్రవాదుల్ని విజయవంతంగా ఎదుర్కొని రియాజ్ నైకూకి షాక్ ఇచ్చారు. పుల్వామా జిల్లా... పాంపోర్‌లోని షార్ ఏరియాలో మరో ఆపరేషన్ కొనసాగుతోంది. అది కూడా మంగళవారం రాత్రే మొదలైంది.


ప్రపంచమంతా కరోనాతో బాధపడుతుంటే... పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం కాశ్మీర్‌లోకి పందికొక్కుల్లా దూరి... దేశాన్ని సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నారు. ఏం చేస్తే వాళ్ల పీడ విరగడవుతుంది అని ఎదురుచూస్తున్న సైన్యానికి... ఆదివారం ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో గట్టి దెబ్బ తగిలింది. ఆ కాల్పుల్లో ఓ మేజర్, ఓ ఎస్సై సహా... ఐదుగురు సైనికులు చనిపోయారు. అప్పటి నుంచి దెబ్బకు దెబ్బ తియ్యాలని ఇండియన్ ఆర్మీ కాచుక్కూర్చుంది. సరిగ్గా అదే టైంలో రియాజ్ నక్కి నక్కి తిరుగుతున్నాడని అర్థమైంది. ఆర్డర్ వచ్చింది. ఆపరేషన్ మొదలైంది. అతన్ని లేపేయడంతో అంతమైంది.


కాశ్మీర్‌లో ఇంకా చాలా గుంటనక్కలున్నాయి. ఒక్కోదాన్నీ వెతికి వెతికి మట్టుపెడుతోంది మన సైన్యం. అంతేలే... పక్కన పాకిస్థాన్ లాంటి దేశం ఉంటే... ప్రశాంతత ఎక్కడుంటుంది.
First published: May 6, 2020, 12:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading