Powerful Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా?.. అయితే అతి తక్కువ ధరల్లో లభించే ఈ కార్లపై ఓలుక్కేయండి..

సోనెట్ కార్ (Image : kia india)

భారత మార్కెట్​లో మిడ్​రేంజ్ కార్లకు మంచి డిమాండ్​ ఉంటుంది. బడ్జెట్​ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు అందిస్తుండటంతో వీటి కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. వీటిలోని ఫీచర్లు, ఫ్యుయల్​ ఎఫీషియన్సీ, సేఫ్టీ, ఆల్టర్నేటివ్​ పవర్‌ట్రెయిన్లు మీ అన్ని అవసరాలు తీర్చగలవు. ప్రస్తుతం భారత మార్కెట్​లో రూ. 15 లక్షల ధరలోపు లభిస్తున్న బెస్ట్​ మిడ్​రేంజ్ కార్లను పరిశీలిద్దాం.

  • Share this:
భారత మార్కెట్​లో మిడ్​రేంజ్ కార్లకు మంచి డిమాండ్​ ఉంటుంది. బడ్జెట్​ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు అందిస్తుండటంతో వీటి కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. వీటిలోని ఫీచర్లు, ఫ్యుయల్​ ఎఫీషియన్సీ, సేఫ్టీ, ఆల్టర్నేటివ్​ పవర్‌ట్రెయిన్లు మీ అన్ని అవసరాలు తీర్చగలవు. ప్రస్తుతం భారత మార్కెట్​లో రూ. 15 లక్షల ధరలోపు లభిస్తున్న బెస్ట్​ మిడ్​రేంజ్ కార్లను పరిశీలిద్దాం. కియా సొనెట్ కారు.. రూ. 15 లక్షలలోపు లభించే బెస్ట్​ కార్లలో కియా సోనెట్​ ఎస్​యూవీ ముందు వరుసలో ఉంటుంది. ఇది విడుదలైన కొద్ది రోజుల్లోనే గణనీయమైన సేల్స్ సాధించింది. కియా సోనెట్​ మొత్తం మూడు ఇంజన్​, ఐదు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 1.2 లీటర్ NA పెట్రోల్ ఇంజన్​తో కూడిన 5 -స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్​బాక్స్, 1.0 -లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్​తో కూడిన 6 -స్పీడ్ iMT గేర్​బాక్స్​ను అందించారు. అయితే, దీనిలోని 1.0 -లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్​ 118bhp పవర్​, 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వోక్స్​వాగన్​ పోలో జీటీ
రూ. 15 లక్షల ధరలోపు లభించే బెస్ట్​ కార్లలో వోక్స్​వాగన్ పోలో జీటీ కూడా ఒకటి. ఈ హాట్ హాచ్ సెగ్మెంట్​లో వస్తుంది.2020లో ఈ కారులో కొన్ని మార్పులు చేసి రీడిజైన్​ చేశారు. ఈ క్రమంలో దీనిలోని 6- స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ను అడ్జెస్ట్​ చేశారు. దీనిలోని ఇంజిన్​ 108 బిహెచ్‌పి, 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ధరలో 6 -స్పీడ్ కన్వర్టర్ బంపర్‌ కలిగిన కారు ఇదే కావడం విశేషం.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ మీడియం రేంజ్​లో లభించే వచ్చే అద్భుతమైన కారు. దీనిలో లుక్స్ లేదా ఫీచర్ల కోసం, అద్భుతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందించింది. ఈ కారు 1.0- లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్​ 99bhp, 172Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్​ను 5 -స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేశారు. దీనితో పాటు, 5 -స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.2 -లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లను కూడా అందించారు.

టాటా నెక్సాన్
కాంపాక్ట్ ఎస్​యూవీ విభాగంలో టాటా నెక్సాన్ అత్యంత ఆదరణ పొందిన కారుగా నిలిచింది. దీనిలో శక్తివంతమైన ఇంజిన్​ను జతచేసింది. నెక్సాన్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 -లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజిన్​ 118bhp, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, డీజిల్ ఇంజన్ 108bhp, 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 -స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్​లు, 2 ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లను చేర్చింది.

హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ రెండు కార్లు మధ్య ఎప్పటి నుంచో గట్టి పోటీ నెలకొంది. అయితే, ఫీచర్ల పరంగా చూస్తే హ్యూందాయ్​ వెర్నా ఉత్తమ ఎంపికనే చెప్పాలి. వెర్నా కారులోమూడు ఇంజిన్​ ఆప్షన్లను అందించారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ల మధ్య దేన్నైనా మీరు ఎంచుకోవచ్చు. 1.0- లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 118bhp, 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Published by:Veera Babu
First published: