పిల్లలు అదే పనిగా టీవీ చూస్తే... లావైపోతారు... డేంజరంటున్న డాక్టర్లు

జనరల్‌గా పిల్లలు అల్లరి చేస్తుంటే... వాళ్లకు మొబైల్ ఇవ్వడమో లేక టీవీ పెట్టి వదిలెయ్యడమో చేస్తుంటారు చాలా మంది పేరెంట్స్. టీవీ చూస్తూ అల్లరి మానేస్తారని వాళ్ల ఆలోచన. కానీ అదే పిల్లల పాలిట శాపం అవుతోందా? లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: August 11, 2019, 9:09 AM IST
పిల్లలు అదే పనిగా టీవీ చూస్తే... లావైపోతారు... డేంజరంటున్న డాక్టర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన శరీరంలో ఎముకలకు, ఇతర అవయవాలకూ రక్షణ కవచంలా బాడీ ఉంటుంది. శరీరంలో కొద్దిగా కొవ్వు ఉంటే పర్వాలేదు గానీ... ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా, అవసరానికి మించి బరువు ఉన్నా ప్రమాదమే. బరువే ఎన్నో సమస్యలకూ, అనారోగ్యాలకూ కారణం అవుతోంది. చాలా మందిని ఈ బరువు సమస్యే బాగా వేధిస్తోంది. ఫలితంగా ఒబెసిటీ మందులు తయారుచేస్తూ... ఫార్మా కంపెనీలు వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ఒబెసిటీ అన్నది పెద్దవాళ్లకే కాదు... పిల్లల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు కారణం ఏంటా అని వెతికితే... ఎక్కువ సేపు టీవీ చూస్తూ ఉండటమే అని తేలింది. అదే పనిగా టీవీ చూస్తున్న పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోవడమే కాదు... వాళ్లకు చిన్నప్పుడే బాన పొట్టలు వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చిన పిల్లలు ఎన్ని ఎక్సర్‌సైజులు చేస్తున్నా బరువు తగ్గట్లేదు.

సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాల్ని రాశారు. చిన్నప్పుడే బరువు పెరిగిపోయే పిల్లలు... పెద్దయ్యేకొద్దీ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫిన్‌లాండ్‌లో 9 నుంచీ 12 ఏళ్ల మధ్య వయసున్న 10వేల మంది పిల్లలపై ఓ పరిశోధన చేశారు. ఆ పిల్లలంతా టీవీల్లో రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. కార్టూన్లు, యానిమేషన్లు చూస్తున్నారు. వాళ్ల హైట్, వెయిట్, నడుం చుట్టుకొలతను పరిశోధకులు పరిశీలించారు. ఎంత ఎక్కువ సేపు టీవీ చూస్తున్నారో, అంత ఎక్కువగా పిల్లలు లావు అవుతున్నట్లు తేలింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే... ఆ పిల్లలంతా ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నవాళ్లే. కానీ బరువు మాత్రం పెరుగుతున్నారు.

టీవీతోపాటూ కంప్యూటర్, మొబైల్ గేమ్స్ ఆడే పిల్లల పరిస్థితీ ఇలాగే ఉంటోంది. అందువల్ల పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పిల్లలు టీవీ, కంప్యూటర్లను చూడటం ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు. రోజుకు 3 గంటల కంటే ఎక్కువ సేపు చూస్తే డేంజరంటున్నారు. వాటి బదులు... ఫిజికల్ యాక్టివిటీ పెంచమంటున్నారు. పిల్లలు ఫిట్‌గా ఉంటేనే... ఫ్యూచర్‌లో వాళ్లు బలంగా ఉండగలరు. లేదంటే తమ బరువు తమకే ఎక్కువై, ఆపసోపాలు పడుతూ ఉంటే... అది వాళ్లకే సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>