విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’... కొత్త రిలీజ్ డేట్!

నవంబర్ 16న విడుదల చేస్తామంటూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించిన విజయ్ దేవరకొండ... ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మార్చుకున్న ‘టాక్సీవాలా’!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 20, 2018, 4:13 PM IST
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’... కొత్త రిలీజ్ డేట్!
‘టాక్సీవాలా’ న్యూ పోస్టర్ (twitter/TheDeverakonda)
  • Share this:
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ‘రౌడీ’ యాటిట్యూడ్‌తో రెచ్చిపోతున్న ఈ పాలమూరి పిల్లగాడికి ‘గీత గోవిందం’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో చేరింది. అదే ఊపులో ‘నోటా’ అంటూ వచ్చాడు విజయ్. అయితే రౌడీ పాలిటిక్స్‌తో యూత్‌కి ఏదో మెసేజ్ ఇద్దామనుకున్న మనోడికి ఆ సినిమా రిజల్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. దేవరకొండ పెట్టుకున్న భారీ ఆశలకు గండికొడుతూ... బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది ‘నోటా’. దాంతో ఎప్పటినుంచో రిపేర్లు చేయించుకుంటున్న ‘టాక్సీవాలా’ సినిమాను వెనక్కి తీసుకొస్తున్నాడీ యంగ్ హీరో.

యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. నిజానికి ‘టాక్సీవాలా’ సినిమాను వేసవి సెలవుల కారణంగా మే నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. పిల్లలకి నచ్చే కామెడీ ప్లస్ సోషియో ఫాంటసీ జోనర్‌లో సినిమా ఉంటుందనే కారణంగా ఆ టైమ్‌లో వస్తే బాగా వర్కవుట్ అవుతుందని భావించారు. అయితే గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉందనే కారణంగా జూన్‌లో విడుదల చేస్తామని ఓ సారి, కాదు ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా వస్తుందని మరోసారి డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఆ డేట్‌కి మనోడు చేసిన ‘గీత గోవిందం’ సినిమా విడుదలయ్యింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గీత గోవిందం’ కోసం ‘టాక్సీవాలా’ను ఆపారనే టాక్ వినిపించింది.
tollywood Young Sensational star Vijay deverakonda's new film taxiwala getting release on 16th November విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’... మరో రిలీజ్ డేట్!

ఆ సినిమా సూపర్‌హిట్ అయిన తర్వాతైనా ‘టాక్సీవాలా’ వస్తుందని భావించారు. కానీ మధ్యలో మొదలైన ‘నోటా’ను తీసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఎట్టకేలకు మరోసారి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. నవంబర్ 16న ‘టాక్సీవాలా’ వస్తుందని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. మరి ఈసారైనా ‘టాక్సీవాలా’ వస్తాడో... మరోసారి డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటాడో చూడాలి.
tollywood Young Sensational star Vijay deverakonda's new film taxiwala getting release on 16th November విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’... మరో రిలీజ్ డేట్!
Loading...
‘గీత గోవిందం’ పైరసీ కాపీలు దొరికినప్పుడే... ‘టాక్సీవాలా’ సిడీలు కూడా బయటికి వచ్చాయి. ఇప్పటికే చాలా సైట్లలో ‘టాక్సీవాలా’ పైరసీ లింకులు కూడా దర్శనమిస్తున్నాయి. పైరసీ తర్వాత విడుదలైన ‘గీత గోవిందం’ మంచి విజయం సాధించింది. అదే సెంటిమెంట్ ‘టాక్సీవాలా’కి కూడా వర్కవుట్ అయితే మాత్రం విజయ్ కమ్‌బ్యాక్ అయినట్టే. అదీకాకుండా ‘పెళ్లిచూపులు’ నుంచి ఓ హిట్టు, ఓ ఫట్టుతో ముందుకు సాగుతున్న దేవరకొండకి ‘నోటా’ తర్వాత పక్కా హిట్టు బొమ్మ పడుతుందని రౌడీఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చూడాలి... ‘టాక్సీవాలా’ టాప్ గేర్‌లో దూసుకుపోతుందో... లేక పంక్చరై, షెడ్డుకు చేరుతుందో!
First published: October 20, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...