హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

విష ప్రపంచంలో నాగశౌర్య... అరుదైనోడిని మార్చేశారుగా!

విష ప్రపంచంలో నాగశౌర్య... అరుదైనోడిని మార్చేశారుగా!

నాగశౌర్య ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటో

నాగశౌర్య ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటో

విష ప్రపంచంలో అడుగుపెట్టిన యంగ్ హీరో... స్మార్ట్ ఫోన్‌తో ఫోటోను ట్వీట్ చేసిన నాగశౌర్య...

‘ఇందాక వస్తుంటే పెరట్లో ఓ మొక్క. చాలా అరుదైన జాతికి చెందింది. దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. మీ ఆయన కూడా ఆ మొక్కలాగే చాలా అరుదైన వ్యక్తి. ఆయన్ని అలాగే ఉండనుద్దాం...’ యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. యంగ్ టైగర్ అభిమాని, యంగ్ హీరో నాగశౌర్య కూడా ఇన్నాళ్లు అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలోనే ఉండేవాడు. ఎందుకంటే అనేక రకాల ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ వాడుతూ కుర్రకారు దూసుకుపోతుంటే... ఇంతవరకూ హీరో నాగశౌర్యకి మొబైల్ ఫోన్ కూడా లేదు.

వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. అయితే ఇన్నాళ్లు అరుదైన వ్యక్తుల జాబితాలో పదిలంగా ఉన్న మనోడు... ఇప్పుడు విష ప్రపంచంలో అడుగుపెట్టాడు. అదేనండి ఓ స్మార్ట్ ఫోన్ కొనేశాడు. తన మొట్టమొదటి మొబైల్‌ను పట్టుకుని దిగిన ఫోటో పోస్ట్ చేసిన నాగశౌర్య... ‘ఇన్నేళ్ల తర్వాత నా చేతిలో ఓ స్మార్ట్ ఫోన్... నేను విష ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు కదా?’ అంటూ ట్వీట్ చేశాడు.

‘ఛలో’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్యకు... ఆ తర్వాత వరుసగా రెండు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుందని ఊహించిన ‘అమ్మమ్మ గారిల్లు’ ఆచూకీ లేకుండా పోతే... ‘గే’ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘నర్తనశాల’ బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. ప్రస్తుతం కొత్త దర్శకుడు రాజా కొలస దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు నాగశౌర్య.

First published:

Tags: Naga shourya, Smartphone, Tollywood

ఉత్తమ కథలు