సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna)మరణ వార్తను ఇంకా తెలుగు ప్రజలు, ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసి ప్రేక్షకుల్ని అలరించిన మహానటుడు దూరమైన సందర్భంగా ఆయన పార్ధివదేహాన్ని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో సెలబ్రిటీలు, వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. అయితే సూపర్ స్టార్ కృష్ణను దర్శించుకోవడానికి జూనియర్ కృష్ణ రావడం..భౌతికాయం దగ్గర కన్నీరు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. కృష్ణకు అభిమానులే ఉంటారు..కాని జూనియర్ కృష్ణ ఏమిటని ఆశ్చర్యపోకండి ..అచ్చం టాలీవుడ్ సూపర్ స్టార్‌లాగానే వేషాధారణతో ఓ జూనియర్ ఆర్టిస్ట్(Junior Artist)చిట్టిబాబు (Chittibabu)కృష్ణ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న వీడియో నెట్టింట్లో వైరల్(Viral)అవుతోంది. అతని గురించి, వీడియో(Video)పై ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలిస్తే కృష్ణ ఫాలోయింగ్ అర్ధమవుతుంది.
డూప్ సూపర్ స్టార్ వీడియో..
టాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన కృష్ణ ఇకలేరనే వార్త అందర్ని బాధిస్తోంది. ఆయన చివరిక్షణాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట్లో సెర్చ్ చేస్తుంటే ఓ వీడియో అందర్ని ఆకర్షిస్తోంది. అదే చనిపోయిన కృష్ణను దర్శించుకునేందుకు జూనియర్ కృష్ణ హైదరాబాద్‌కు రావడం. అదేంటని ఆశ్చర్యపోకండి..విశాకపట్నం జిల్లా మాడుగుల మండలం డి.గొడివాడ పంచాయితీలోని కొత్తవలస గ్రామానికి చెందిన జనాపరెడ్డి చిట్టిబాబు అనే జూనియర్ ఆర్టిస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గెటప్‌లో హైదరాబాద్‌లోని కృష్ణ నివాసానికి వెళ్లాడు. అక్కడ అందరు అభిమానులతో సమానంగా కాకుండా హీరో గెటప్‌లో వెళ్లడంతో అందర్ని ఆశ్చర్యపోయారు.
View this post on Instagram
కృష్ణను చూసి బోరున ఏడ్చిన చిట్టిబాబు..
చిట్టిబాబును వెంటబెట్టుకొని భౌతికాయం దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ గులాబీ రేకులు అతనికి ఇవ్వడంతో సూపర్ స్టార్ కృష్ణ పార్ధివదేహంపై వేసి నమస్కారం చేసుకున్నాడు. వెంటనే కన్నీరు పెట్టుకున్నాడు చిట్టిబాబు. ఈదృశ్యం అక్కడున్న వాళ్లందర్ని ఎంతగానో ఆకట్టుకుంది. చనిపోయిన హీరో కోసం ఆయన వేషాలు వేసుకునే ఓ సాధారణ అభిమాని ఇంటికి హీరో గెటప్‌లో రావడం, ఆయనకు నివాళులర్పించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ వీడియోనే చిట్టిబాటు తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేశాడు.
డూప్ కృష్ణకు క్రేజ్ ..
చిట్టిబాబు కృష్ణ భౌతికాయాన్ని దర్శించుకోవడంపై అభిమానులు వేర్వేరుగా స్పందిస్తున్నారు. మొత్తానికి సాధించావు చిట్టీ అని ఒకరు..కృష్ణగారు బ్రతికి ఉండగా కలిస్తే బాగుండనే మరికొందరు, ఓ అభిమాని సూపర్ స్టార్ మన మధ్యలో లేకపోయినా నీలో చూసుకొని ఆనందంపడతామని మరొక అభిమాని హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఇక నుంచి నువ్వే మా కృష్ణ, ఆయనలాగే మంచి పేరు తెచ్చుకోవాలంటూ ఆశీర్వదిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.