బాక్సాఫీస్: మహేశ్‌బాబు మహర్షి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్

మహేష్‌బాబు 25వ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ గురువారం విడుదల అయ్యింది. సినిమాలో మ‌హేశ్ బాబు చాలా బాగా న‌టించాడు. రిషి కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు.

news18-telugu
Updated: May 10, 2019, 8:43 AM IST
బాక్సాఫీస్: మహేశ్‌బాబు మహర్షి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్
మహర్షి చిత్రంలో మహేష్ బాబు
  • Share this:
శ్రీమంతుడు, భరత్‌ అనే నేను హిట్ల తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన చిత్రం మహర్షి. ఊపిరి తర్వాత ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా బ్యానర్లపై నిర్మాతలు దిల్‌రాజు,అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా సామాజిక సందేశంతో రూపొందిన భారీ చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్‌బాబు 25వ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ గురువారం విడుదల అయ్యింది. సినిమాలో మ‌హేశ్ బాబు చాలా బాగా న‌టించాడు. రిషి కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా హాలీవుడ్ హీరోను త‌ల‌పించాడు. న‌ట‌న‌లో కూడా పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. అల్లరి నరేష్ కూడా రవి పాత్రకు ప్రాణం పోశాడు. ఇన్నాళ్లూ కామెడీ సినిమాలనే ఎంచుకున్న న‌రేష్.. ఇప్పుడు మాత్రం ఎమోష‌న‌ల్ పాత్రలో చాలా బాగా న‌టించాడు. పూజాహెగ్డే అందాల ఆర‌బోత‌కు స‌రిపోయింది. రావు రమేష్, జ‌య‌సుధ‌, ప్రకాశ్ రాజ్, సాయి కుమార్ పాత్రలు బాగున్నాయి. వెన్నెల కిషోర్, శ్రీ‌నివాస్ రెడ్డి లాంటి వాళ్లు అక్కడక్కడ క‌నిపించారు.

అయితే, గురువారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలి రోజు దాదాపు రూ.45 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమెర్ సంధు సినిమా రూ.45కోట్లు రాబట్టిందని తెలిపారు. చెన్నైలో రూ.23 లక్షలు, కాకినాడలో రూ.50లక్షలకు పైగా, గుంటూరులో రూ.4.4కోట్లు సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అతి ముఖ్యంగా సినిమాలకు అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో మొత్తం 28.98 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.


First published: May 10, 2019, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading