TOLLYWOOD STYLISH STAR ALLU ARJUN REMUNERATION FOR PUSHPA FILM NR
Allu Arjun Remuneration: పుష్ప సినిమాకు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Allu Arjun Remuneration
Allu Arjun Remuneration: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ మొత్తానికి క్లాస్ సినిమాల నుంచి మాస్ సినిమాలకు అడుగు పెట్టాడు. ఇక ఇటీవలే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ టీజర్
Allu Arjun Remuneration: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ మొత్తానికి క్లాస్ సినిమాల నుంచి మాస్ సినిమాలకు అడుగు పెట్టాడు. ఇక ఇటీవలే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల, విమర్శకుల నుండి భారీస్థాయిలో ప్రశంసలు అందాయి. ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ ఊర మాస్ లో ఉండగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ టీజర్ లో తగ్గేదే లే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయ్యింది.
సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను అక్రమంగా రవాణా చేస్తున్న గంధపుచెక్కల నేపథ్యంలో రూపొందించారు. ఇందులో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించగా, ఆయన సరసన భిన్నమైన పాత్రలో రష్మిక మందన కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.
ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పారితోషికం విషయంలో నిజంగా తగ్గేలా లేడు. ఎందుకంటే ఈ సినిమాకు బన్నీ ఏకంగా రూ. 35 కోట్ల ను పారితోషికం గా తీసుకుంటున్నారట. ఇక డైరెక్టర్ సుకుమార్ కూడా రూ. 25 కోట్ల ను, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ రూ. 5 కోట్లు, ఇక రష్మిక మందన రూ. 2 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ క్రేజీ మూవీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో ఫస్టాఫ్ లో బన్నీ స్టూడెంట్ లీడర్ గా, సెకండాఫ్ లో రాజకీయ నాయకుడి గా కనిపించనున్నట్లు సమాచారం. మొత్తానికి బన్నీ క్లాస్ సినిమాలకు దూరం కానున్నాడెమో..
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.