నా కూతురు అభినవ సావిత్రి.. హీరో రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు

Dorasani | Shivatmika | శివాత్మిక చాలా బాగా నటించిందని ఫోన్లు వస్తున్నాయని, కొందరైతే ఆమెను సావిత్రితో పోల్చుతున్నారని చెప్పాడు.

Shravan Kumar Bommakanti
Updated: July 4, 2019, 1:30 PM IST
నా కూతురు అభినవ సావిత్రి.. హీరో రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
దొరసాని చిత్రంలో శివాత్మిక
  • Share this:
రెండేళ్ల కిందట వచ్చిన గరుడ వేగ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్.. తాజాగా, కల్కి చిత్రంలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను తనవైపు తిప్పుకొంటున్నాడు. ఫ్యాన్స్ కూడా మునుపటి రాజశేఖర్ కనిపించాడంటూ ఎత్తేస్తున్నారు. చిత్రం విడుదలయ్యాక ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంలో తన చిన్న కూతురు శివాత్మికపై రాజశేఖర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా.. దొరసాని. ఈ సినిమాలో శివాత్మిక హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఈ మధ్యే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ట్రైలర్ చూసిన వాళ్లంతా శివాత్మిక నటనను మెచ్చుకుంటున్నారు.

అయితే, కల్కి సినిమా ప్రెస్ మీట్‌లో రాజశేఖర్ మాట్లాడుతూ.. శివాత్మిక చాలా బాగా నటించిందని ఫోన్లు వస్తున్నాయని, కొందరైతే ఆమెను సావిత్రితో పోల్చుతున్నారని చెప్పాడు. దీంతో, ఒక వర్గం రాజశేఖర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైలర్‌లో శివాత్మిక బాగా ఉన్న మాట వాస్తవమేనని, అయితే, సావిత్రితో పోల్చుతూ వ్యాఖ్యలు చేయడం ఏం బాగోలేదని విమర్శిస్తున్నారు. ఇంకా సినిమా విడుదల కాకముందే ఆమెను గొప్ప నటితో పోల్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 4, 2019, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading