TOLLYWOOD HEROINE NIVETHA PETHURAJ LIPKISS CONTROVERSY ON PAAGAL MOVIE NR
Nivetha Pethuraj Lipkiss: లిప్ కిస్ గురించి అలా అంటారేంటి?.. నివేదా పేతురాజ్ రుసరుస
Nivetha Pethuraj Lipkiss
Nivetha Pethuraj Lipkiss: ప్రస్తుతం ఒక వార్త పది రకాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అది సినీ తారల గురించి అయితే ఎన్ని రకాలుగా ప్రచారం అవుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Nivetha Pethuraj Lipkiss: ప్రస్తుతం ఒక వార్త పది రకాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అది సినీ తారల గురించి అయితే ఎన్ని రకాలుగా ప్రచారం అవుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ నేపథ్యంలోనే విభిన్న పాత్రల్లో నటిస్తూ తన అందంతో అభిమానులను సొంతం చేసుకున్న నటి నివేత పేతురాజుపై ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ గాసిప్‌పై నివేత పేతురాజు స్పందించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నివేత పేతురాజు ప్రస్తుతం పాగల్ అనే రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తుండగా నివేత పేతురాజు, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నరేష్ కుప్పిలి సినిమా దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాంటి ఈ సినిమా ఏప్రిల్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాపై.. ఇందులో నటించిన నివేదా పేతురాజ్‌పై ఓ రూమర్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నివేద తన మొదటి సినిమా నుంచి కూడా బోల్డ్ సీన్స్‌లో, కిస్ సీన్స్ లో నటించకూడదు అని ఫిక్స్ అయినట్టు.. అలానే ఈ సినిమాలో కూడా ఆమె నో కిస్ పాలిసీని పాటించినట్టు అందులో రాసుకొచ్చారు. నివేద పేతురాజు ఆ పాలిసీ పాటించడం వల్లే విశ్వక్ సేన మొదటి సారి లిప్ కిస్ లేని సినిమాలో నటించినట్టు అందులో రాశారు.
Nivetha Pethuraj Lipkiss
ఈ గాసిప్ పై స్పందించిన నివేద పేతురాజు ''ముందుగా సినిమాలో కిస్ సిన్ ఉన్నట్టు దర్శకుడు నాకు చెప్పలేదు.. స్క్రిప్ట్ చాలా అందంగా ఉంది'' అంటూ నివేద పేతురాజు ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇన్ డైరెక్ట్ గా నివేద పేతురాజు లిప్ కిస్ సిన్ కి రెడీ అన్నట్టు హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి నెక్స్ట్ సినిమాలో నివేద పేతురాజు లిప్ కిస్ సిన్ ఉంటుందా? లేదా అనేది చూడాలి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.