హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Hansika Wedding: దేశముదురు హీరోయిన్‌ పెళ్లికి చీఫ్‌ గెస్ట్‌లు వీళ్లే .. హన్సికా ఆహ్వానించింది ఎవర్నో ఈ వీడియో చూడండి

Hansika Wedding: దేశముదురు హీరోయిన్‌ పెళ్లికి చీఫ్‌ గెస్ట్‌లు వీళ్లే .. హన్సికా ఆహ్వానించింది ఎవర్నో ఈ వీడియో చూడండి

hansika wedding

hansika wedding

Hansika Wedding: స్టార్ హీరోయిన్ వివాహం అంటే చీఫ్‌ గెస్ట్‌లుగా పాపులర్ పర్సనాలిటీలు, బిగ్‌షాట్‌లు, సెలబ్రిటీలు, వీవీఐపీలను ఆహ్వానిస్తారు. కాని టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వాని, సోహైల్‌ పెళ్లికి మాత్రం ఎవరూ ఊహించని వాళ్లను గెస్ట్‌లుగా ఆహ్వానించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

స్టార్ హీరోయిన్ వివాహం అంటే చీఫ్‌ గెస్ట్‌లుగా పాపులర్ పర్సనాలిటీలు, బిగ్‌షాట్‌లు, సెలబ్రిటీలు, వీవీఐపీలను ఆహ్వానిస్తారు. కాని టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వాని(Hansika Motwani), సోహైల్‌(Sohail)పెళ్లికి మాత్రం ఎవరూ ఊహించని వాళ్లను గెస్ట్‌లుగా ఆహ్వానించింది. జైపూర్‌(Jaipur)లో రాజకోటలో జరుగుతున్న తన పెళ్లికి తప్పకుండా రావాలంటూ స్పెషల్‌గా వాళ్లకు ఆహ్వానం కూడా పంపించింది దేశముదురు హీరోయిన్. ఆదివారం జరుగుతున్న పెళ్లి కోసం హన్సికా (Hansika)ఆహ్వానించిన చీఫ్‌ గెస్ట్‌లు ఎవరో తెలియాలంటే ఓ స్వచ్చంద సంస్థ సభ్యుడు షేర్ చేసిన వీడియో(Video) చూడాల్సిందే.

Tollywood: బాలకృష్ణ పక్కన నేను హీరోయిన్‌గా యాక్ట్ చేయడమా .. సోనాక్షిసిన్హా రియాక్షన్‌ వాస్తవమేనా..!

హన్సిక పెద్ద మనసు..

డబ్బు ఉన్న వాళ్లందరికి మంచి మనసు ఉండదు. అలాగని మంచి మనసు ఉన్న వాళ్లకు పేదల్ని ఆదుకునేంత డబ్బు ఉండదు. ఈ రెండు ఉన్నవాళ్లు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వానీ. డిసెంబర్‌ 4వ తేది ఆదివారం జైపూర్‌ కోటలో జరుగుతున్న తన వివాహానికి చీఫ్‌ గెస్ట్‌లుగా వీధి బాలలు, అనాధ పేద చిన్నారులను ఆహ్వానించి తన గొప్ప మనుసును మరోసారి చాటుకుంది ఈ సౌత్ బ్యూటీ.

పేద చిన్నారులే చీఫ్‌ గెస్ట్‌లు..

సోహైల్‌తో గ్రాండ్‌గా జరుగుతున్న తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి అతి తక్కువ మందిని ఆహ్వానించింది హన్సికా మోత్వాని. అయితే పెళ్లి వేడుకలకు మాత్రం తప్పకుండా రావాలంటూ ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ముద్రించి వారికి పంపించింది. వాళ్లే నిరుపేద చిన్నారులు. బాలీవుడ్‌లో రిచ్‌గా సెటిలైన ఈ బ్యూటీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం నాణానికి ఓవైపు మాత్రమే. ఆమెలో తెలియని మరో కోణం ఏమిటంటే నిరుపేదలు, చిన్నారులకు సేవ చేసేందుకు కొన్ని ఎన్జీవోలతో కలిసి సహాయం చేస్తూ వస్తోంది హన్సికా.

వైరల్ అవుతున్న వీడియో ..

అందులో భాగంగానే ఆదివారం తాను చేసుకోబోయే పెళ్లికి నిరుపేద చిన్నారులనే ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రాబిన్‌ హుడ్ ఆర్మీ పేరుతో హన్సికా పేద పిల్లల్ని పెళ్లికి ఆహ్వానించడంపై రాబిన్ హుడ్ ఆర్మీ చిన్నారులు హన్సికకు పెళ్లికి తమని పిలిచినందుకు ధన్యవాదాలు చెబుతున్న వీడియో బాగా వైరల్ అవుతోంది. అంతే కాదు పెళ్లికి రెడీ అవుతున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Huma Qureshi: నా సొగసు చూడతరమా అంటున్న బాలీవుడ్ లేడీ ..హుమా ఖురేషి హాట్ పిక్స్ వైరల్

ఈరోజే పెళ్లి ..

తన పెళ్లికి పేద చిన్నారుల్ని చీఫ్‌ గెస్ట్‌లుగా పిలవడమే కాదు..జైపూర్‌లోని కోట సమీపంలో ఉన్న చిన్నారులకు హన్సికా వివాహ భోజనాన్ని పంపించిందట. గొప్ప వాళ్లు ఎప్పుడూ తమ స్థాయిలో ఉండే వాళ్ల గురించే ఆలోచిస్తారు. కాని హన్సికా లాంటి స్టార్ హీరోయిన్ తన వివాహ వేడుకల సమయంలో ఈవిధంగా పేద చిన్నారుల్ని గుర్తుంచుకొని ఆహ్వానించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Hansika motwani, Tollywood actress

ఉత్తమ కథలు