సినిమా(Cinema)ల్లోకి వచ్చేవాళ్లకు చాలా కలలు ఉంటాయి. నటనతో పాటు ఇక్కడ అదృష్టం కూడా చాలా ముఖ్యం. కొందరు పెద్ద స్టార్లుగా ఎదిగినా.. మరికొందరు పత్తాలేకుండా పోయారు. అవకాశాలు రాక.. నటించిన సినిమా విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడే ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. తెలుగు సెలబ్రిటీ కమెడియన్ రఘు కారుమంచి (Raghu Karumanchi) కి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. గత రెండేళ్లుగా కోవిడ్ ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇలా మళ్లీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ కోవిడ్ కారణంగానే కొన్ని సినిమా పనులు సగంలో నిలిచిపోయాయి. ఇలా ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు సినిమా వాళ్లు. ఇక రఘు విషయంలో కూడా అంతే జరిగింది.
ఇతడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఆది చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. తర్వాత ఇతడు అదుర్స్, పవర్ చిత్రాల్లో తన కామెడీ స్టైల్‌లో అందరినీ నవ్వించాడు. వీటితోపాటు చాలా చిత్రాల్లో పర్‌ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని అందించాడు. రెండు దశాబ్దాల కాలం పాటు సినీరంగం ఉన్నాడు రఘు. అతడు నటించిన కొన్ని సినిమాలు అయితే అస్సలు విడుదల చేయకపోవడం వంటివి జరిగాయి. ఇక ఈ సమయంలోనే కోవిడ్ వ్యాప్తి పెరిగిపోవడంతో తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాడు. ఇక సినిమాలు దూరం అయ్యాడు. కోవిడ్ ఎఫెక్ట్‌తో సరైన అవకాశాలు లేకపోవడంతో కెరీర్‌లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడు.
అతడి సొంతూరు అయిన నల్గొండకు వెళ్లిపోయాడరు. హైదరాబాద్ సరిహద్దుల్లో తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. ఆ తర్వాత కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. దాని ద్వారా విపరీతంగా లాభాలు పొందాడు. ఈ బిజినెస్‌లో మంచి లాభాలు రావడంతో ఆ డబ్బుతో లిక్కర్ బిజినెస్ మొదలు పెట్టాడట రఘు. లిక్కర్ షాపు నిర్వహిస్తున్న తన స్నేహితులు సాయిరామ్ రెడ్డి, హరినాథ్‌లను సంప్రదించి వారితో లిక్కర్ షాప్ స్టార్ట్ చేశాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో రఘుతో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి టెండర్స్ వేశారు.
అందులో రెండు టెండర్స్ రఘు పేరు మీద వచ్చాయి. అభినవ్ లిక్కర్స్ 1&2 పేరుతో నల్లగొండ జిల్లా సరిహద్దులోని మర్రిగూడ బైపాస్ దగ్గర ఈ మద్యం షాపులను ఏర్పాటు చేశారు . డిసెంబరు 1న స్టోర్‌ను ప్రారంభిస్తారు. షాపులో అతడు మంద్యం అమ్ముతుండగా.. అక్కడకు వచ్చిన వాళ్లు కొంతమంది షాక్ అయ్యారు. రఘు మద్యం అమ్మడం ఏంటని.. దీంతో అతడి దగ్గరకు వెళ్లి ఫొటోలు తీసుకోవడం.. వీడియోలు తీయడం చేశారు. ప్రస్తుతం అతడికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.
మద్యం అమ్ముతుండగా.. ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తొలుత హాస్యనటుడు రఘు మద్యం షాపుల ముందు పూజలు చేసి ఆ తర్వాత కౌంటర్ల వద్ద మద్యం విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన వ్యాపారం విజయవంతం కావడానికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు రఘు. మొత్తానికి సినిమా రంగంలో అవకాశాలు లేవని బాధపడే వారికి ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కొని ఎంతోమంది కోస్టార్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రఘు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardast comedian, Telangana, Tollywood, Viral