హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వేశ్యగా మారుతున్న పాయల్ రాజ్‌పుత్.. అలాంటివి నాకు నచ్చవంటూ..

వేశ్యగా మారుతున్న పాయల్ రాజ్‌పుత్.. అలాంటివి నాకు నచ్చవంటూ..

RX100 మూవీ చిత్రంలోని స్టిల్

RX100 మూవీ చిత్రంలోని స్టిల్

Tollywood News: 1970-80 కాలంలో రాబిన్ హుడ్‌గా పేరుపొందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో పాయల్ వేశ్యగా నటించనుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినప్పటికీ.. రెండో కథనాయికగా పాయల్‌ను ఎంపిక చేశారు.

ఇంకా చదవండి ...

    ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు యూత్ హృదయాలను కొల్లగొట్టింది.. పాయల్ రాజ్‌పుత్. తొలి చిత్రంలో బోల్డ్‌గా, నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించిన ఈ పంజాబీ భామ ఆఫర్లలో మునిగి తేలుతోంది. తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా గడిపేస్తోంది. అక్కినేని నాగార్జున నటిస్తున్న మన్మథుడు-2, వెంకటేశ్ నటిస్తున్న వెంకీమామ, రవితేజ డిస్కో రాజా చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతోంది. 1970-80 కాలంలో రాబిన్ హుడ్‌గా పేరుపొందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో పాయల్ వేశ్యగా నటించనుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినప్పటికీ.. రెండో కథనాయికగా పాయల్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర వేశ్య అని, పాత్ర కూడా చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పడంతో ఆమె అంగీరించారు. వేశ్య పాత్ర చేస్తున్నందుకు ఏం అనిపించడం లేదా? అని ఓ విలేకరి అడగ్గా.. దిమ్మదిరిగిపోయే సమాధానం ఇచ్చింది.


    వేశ్య పాత్రలో నటించడం తప్పెందుకు అవుతుందని, ఆ పాత్ర ఒప్పుకున్నాక వారి జీవితాలు, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. వేశ్యలు బతకడానికి మాత్రమే అలాంటి పనులు చేస్తున్నారని, దాన్ని ఆపాలని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదని కుండ బద్దలు కొట్టింది. అలాంటి ప్రశ్నలు తనకు నచ్చవని సమాధానమిచ్చింది. అనుష్క, టబు, రాణిముఖర్జీ, కరీనా లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా వేశ్య పాత్రలు చేశారని, మంచి నటీమణులుగా పేరు తెచ్చుకున్నారని, తాను కూడా ఆ పాత్ర చేసి మంచి నటిగా ప్రూవ్ చేసుకుంటానని స్పష్టం చేసిందీ భామ.

    First published:

    Tags: Bala Krishna, Bala Krishna Nandamuri, K. S. Ravikumar, Payal Rajput, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News, Tollywood news

    ఉత్తమ కథలు