మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విడుదల డేట్ ఫిక్స్.. ఆ రోజే ప్రేక్షకుల ముందుకు..

సైరా సినిమా అక్టోబరు 2న గాంధీ జయంతినాడు విడుదల చేస్తారని, లేకపోతే 2020 సంక్రాంతికి విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తెరదించుతూ.. అక్టోబరు 2నే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బ‌ృందం.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 6, 2019, 8:17 AM IST
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విడుదల డేట్ ఫిక్స్.. ఆ రోజే ప్రేక్షకుల ముందుకు..
‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (ఫైల్ ఫోటో)
  • Share this:
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథకు దృశ్య రూపమిచ్చే సినిమా సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ సినిమా అక్టోబరు 2న గాంధీ జయంతినాడు విడుదల చేస్తారని, లేకపోతే 2020 సంక్రాంతికి విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తెరదించుతూ.. అక్టోబరు 2నే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బ‌ృందం. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, చిరంజీవి డబ్బింగ్‌ చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలిపింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అక్టోబరు 2నే చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం శ్రమిస్తోంది. కాగా, ఉయ్యాలవాడ గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయనతార, ఇతర కీలక పాత్రల్లో తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్‌ తదితరులు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అమిత్‌ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 6, 2019, 8:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading