చిట్టి చెల్లెమ్మ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన చిన్నారి అన్నయ్య

తన చిట్టి చెల్లెలు పొయ్యి పక్కనే ఓ బల్లపై కూర్చుంటే... అన్నయ్య తన కోసం ఎంతో చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాడు.

news18-telugu
Updated: September 17, 2019, 12:21 PM IST
చిట్టి చెల్లెమ్మ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన చిన్నారి అన్నయ్య
చిట్టి చెల్లెల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన చిన్నారి అన్నయ్య
  • Share this:
తన  చిట్టి చెల్లెల కోసం ఎగ్ ప్రైడ్ రైస్ చేశాడు చిన్నారి అన్నయ్య. అన్నాచెల్లెల ప్రేమకు ప్రతీకంగా నిలిచిన ఈ వీడియోకు వేలల్లోలైకులు వస్తున్నాయి. చిట్టి చెల్లెలు పొయ్యి పక్కనే ఓ బల్లపై కూర్చుంటే... అన్నయ్య తన కోసం ఎంతో చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాడు. పాన్‌లో ముందుగా ఎగ్ వేసి... ఆ తర్వాత వెజిటెబుల్స్, రైస్ వేసి మసాలాలు... ఉప్పుకారం వేసి కమ్మగా ఫ్రైడ్ రైస్ చేశాడు. చివర్లో డిష్ ఫినిష్ అవ్వగానే... తన చెల్లెల కోసం, తన కోసం వేరే వేరేగా బౌల్స్ ‌లో సర్వ్ చేశాడు. చిట్టి చెల్లెలకు ప్రేమగా తినిపించాడు. మొత్తం వంటనంతా లెఫ్ట్ హెండ్‌తోనే... గరిట కదుపుతూ నిలబడే నిమిషాల్లో ఫినిష్ చేశాడు బుడతడు.

చూడాటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఉన్న ఈవీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా చిన్నారి సూపర్ అంటూ ట్వీట్ చేస్తున్నాడు. ఈ బుడ్డోడు తనకన్నా బాగా వంట చేస్తున్నాడని మరికొందరు మహిళలు పోస్టు చేస్తున్నారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>