Home /News /trending /

TODDLER ACCIDENTALLY ORDERS FURNITURE WORTH RS 1 4 LAKH ONLINE ON HIS MOTHERS PHONE GH VB

Viral News: ఆ బుడతడు చేసిన పనికి మీరు షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా రూ.1.4 లక్షలతో..

ఆర్డర్ చేసిన బుడతడు

ఆర్డర్ చేసిన బుడతడు

న్యూజెర్సీలోని 22 నెలల వయస్సు ఉన్న ఒక పిల్లోడు తన తల్లి ఫోన్‌లోని వాల్‌మార్ట్ వెబ్ సైట్ నుంచి ఆన్‌లైన్‌లో రూ. 1.4 లక్షల విలువైన ఫర్నీచర్‌ను (furniture worth 1.4 lakh) ఆర్డర్ చేయగలిగాడు. తన కుమారుడు ఇలా చేశాడని తెలుసుకొని తండ్రి ప్రమోద్ కుమార్, తల్లి మధు కంగుతిన్నారు. ఏమైందంటే..

ఇంకా చదవండి ...
స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల (electronic gadgets) నుంచి చిన్న పిల్లలను (kids) దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే చిన్నారులు తమకు తెలియకుండానే సరిదిద్దుకోలేని పెద్ద తప్పులు (incorrigible mistales) చేసే ప్రమాదం ఉంది. దీనివల్ల మొత్తం కుటుంబం ఇరకాటంలో పడాల్సి వస్తుంది. ఇందుకు ఒక మంచి ఉదాహరణగా తాజాగా జరిగిన ఓ సంఘటన నిలుస్తోంది. న్యూజెర్సీలోని 22 నెలల వయస్సు ఉన్న ఒక పిల్లోడు తన తల్లి ఫోన్‌లోని వాల్‌మార్ట్ వెబ్ సైట్ నుంచి ఆన్‌లైన్‌లో రూ. 1.4 లక్షల విలువైన ఫర్నీచర్‌ను (furniture worth 1.4 lakh) ఆర్డర్ చేయగలిగాడు. తన కుమారుడు ఇలా చేశాడని తెలుసుకొని తండ్రి ప్రమోద్ కుమార్, తల్లి మధు కంగుతిన్నారు.

మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని ..ఏం ఘనకార్యం వెలగబెట్టాడో చూడండి

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూజెర్సీలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న అయాన్ష్ కుమార్ అనే రెండేళ్ల బాబు ఫోన్ తో బాగా ఆడుకుంటాడు. ఈ క్రమంలో తాజాగా తన తల్లి ఫోన్ నుంచి వాల్‌మార్ట్‌లోని రూ. 1.4 లక్షల ఖరీదైన ఫర్నీచర్‌ను ఆర్డర్ చేశాడు. ఈ వింతను మొదట్లో తండ్రి మధు నమ్మలేకపోయాడు. మరోవైపు అతని తల్లి మధు తన చిన్న కొడుకు చేష్టలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియక ఆశ్చర్యానికి లోనైంది. అయితే ఒక చంటి బిడ్డ ఫర్నీచర్‌ను ఎలా ఆర్డర్ పూర్తి చేయగలడనే సందేహం మీలో వచ్చే ఉంటుంది కదూ!

నిజానికి పసిబిడ్డ 1.4 లక్షల విలువైన ఆర్డర్ పెట్టడం అసాధ్యమే. కానీ ఇక్కడ అప్పటికే అయాన్ష్ తల్లి మధు తనకు నచ్చిన కొన్ని ఫర్నీచర్‌ ఐటమ్స్ ను పర్చేజ్ లిస్టు/ షాపింగ్ షాపింగ్‌ కార్ట్ (Shopping Cart)లో యాడ్ చేసింది. అవి మొత్తం ఒకేసారి డెలివరీ అయ్యేలా అయాన్ష్ కుమార్ ఆర్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేయగలిగాడు. అలా 2000 డాలర్ల (సుమారు రూ.1.4 లక్షల) ఖరీదైన ఫర్నీచర్ చకచకా ఇంటికి డెలివరీ కావడం ప్రారంభమవడంతో మధుకి తన కార్ట్ (cart) చెక్‌ అయిందని అర్థమైంది. ఈ విషయం తెలిసిన తండ్రి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

Trending: డాన్స్ చేసింద‌ని వ‌ధువును చెంపదెబ్బ కొట్టి వ‌రుడు.. త‌ర్వాత ఏం

వాస్తవానికి తల్లి మధు తన కొత్త ఇంటి కోసం కొన్ని వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని భావించింది. కానీ ఆమె కుమారుడు కార్ట్‌లోని అన్ని వస్తువులను ఒక ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా విజయవంతంగా కొనుగోలు చేసి షాకిచ్చాడు. "మావాడు ఇలా చేశాడని నమ్మడం చాలా కష్టంగా ఉంది, కానీ అదే జరిగింది" అని అయాన్ష్ తండ్రి ప్రమోద్ కుమార్ అన్నారు. కొన్ని ప్యాకేజీలు చాలా పెద్దవని.. అవి తలుపు ద్వారా ఇంట్లోకి తీసుకెళ్లడం కూడా కష్టంగా మారిందని తల్లి చెప్పుకొచ్చింది. తన వాల్‌మార్ట్ ఖాతాను చెక్ చేసినప్పుడు తన కొడుకు కుర్చీలు, ఫ్లవర్ స్టాండ్‌లు, అవసరం లేని అనేక ఇతర వస్తువులను ఆర్డర్ చేసినట్లు ఆమె కనుగొంది.

"అతను చాలా చిన్నవాడు, చాలా ముద్దుగా ఉన్నాడు, ఇవన్నీ అతను ఆర్డర్ చేశాడని తెలిసి మేం నవ్వుకున్నాం" అని మధు తెలిపింది. మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు ఈ పిల్లవాడిని తన తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటారట. కానీ ఈసారి ఓ చిన్న యాక్సిడెంట్ తో పెద్ద తప్పు జరిగిపోయింది. ఇలాంటి మిస్టేక్ పునరావృతం కాకుండా ఇప్పటినుంచి తమ డివైజ్‌లలో పాస్‌కోడ్‌లు, ఫేషియల్ రికగ్నిషన్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తామని ప్రమోద్ చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Trending news, Viral image, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు