Home /News /trending /

TODAY IS AMBEDKARS BIRTHDAY IMPORTANT THINGS TO KNOW ABOUT THE FATHER OF THE INDIAN CONSTITUTION GH VB

Dr Ambedkar: నేడు అంబేడ్కర్ జయంతి.. భారత రాజ్యాంగ నిర్మాత గురించి తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు..!

అంబేద్కర్ విగ్రహం

అంబేద్కర్ విగ్రహం

భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ భారతదేశానికి లభించిన గొప్ప ఆస్తి. ఆయన ద్వారానే భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్యం అందింది. భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పి డా బి ఆర్ అంబేడ్కర్‌.

భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌(Ambedkar) భారతదేశానికి లభించిన గొప్ప ఆస్తి. ఆయన ద్వారానే భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్యం అందింది. భారత రాజ్యాంగం(Indian Constitution) ప్రధాన రూపశిల్పి డా బి ఆర్ అంబేడ్కర్‌. భారతదేశంలో దళిత చైతన్యానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ఆయన గొంతుగా మారారు. ఏటా ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌‌ జయంతిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాజ్యాంగ నిర్మాత గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ప్రధాన అంశాలు ఇవే..  1891 ఏప్రిల్ 14న మోవ్ పట్టణంలోని సైనిక కంటోన్మెంట్ ప్రాంతం (స్వాతంత్య్రం రావడానికి పూర్వమున్న మహారాష్ట్ర(Maharashtra), ఇప్పుడు మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లో ఉంది)లో జన్మించారు. దీనిని ఇప్పుడు డాక్టర్ అంబేడ్కర్‌ నగర్‌గా పిలుస్తారు. డా.భీమ్ రావ్ అంబేడ్కర్‌ తన తల్లిదండ్రులకు 14వ సంతానం. అందరికంటే చివరివాడు. అతని అసలు ఇంటిపేరు అంబావాడేకర్. అయితే దానిని అతని ఉపాధ్యాయుడు పాఠశాలలో అంబేడ్కర్‌‌గా మార్చారు.

Permanent makeup: పర్మినెంట్ మేకప్ టెక్నిక్ అంటే ఏంటి? కొన్ని ముఖ్యమైన వాస్తవాలను తెలుసుకోండి..


డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్‌ హిందూ మతంలో మహర్ కులంలో (మహారాష్ట్ర స్థానికులు) జన్మించారు. దళితులకు వ్యతిరేకంగా అమానవీయ కుల ఆచారాలు, స్త్రీ పురుషుల మధ్య అసమానతలకు వ్యతిరేకించారు. అంబేడ్కర్‌ 1956లో బౌద్ధమతాన్ని స్వీకరించారు.  14 సంవత్సరాల వయస్సులో, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ రమాబాయిని వివాహం చేసుకున్నారు. రమాబాయి అంబేడ్కర్‌ దీర్ఘకాల అనారోగ్యం తర్వాత 1935 మే 27న 37 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె మరణానంతరం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ సవితా అంబేడ్కర్‌‌ను వివాహం చేసుకున్నారు. నిజానికి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సవితా అంబేడ్కర్‌, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌‌తో కలిసి బౌద్ధమతం స్వీకరించారు. ఆమె 2003లో ప్రాణాలు విడిచారు.

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ 64 సబ్జెక్టులలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయనకు 9 భాషలపై పరిజ్ఞానం ఉంది. దాదాపు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.  అంబేడ్కర్‌‌ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లో 8 సంవత్సరాల చదువును పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి "డాక్టర్ ఆల్ సైన్స్" విలువైన డాక్టరేట్ పట్టా పొందిన ప్రపంచంలోనే మొదటి, ఏకైక వ్యక్తి అంబేద్క్‌ కావడం విశేషం.

* ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలను కలిగి ఉన్న వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌. 1950లో కొల్హాపూర్ నగరంలో ఆయన మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లండన్ మ్యూజియంలో విగ్రహం ఉన్న ఏకైక భారతీయుడు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌. ఆయన జయంతిని కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.  భారతీయ త్రివర్ణ పతాకంపై "అశోకచక్ర"కు స్థానం కల్పించిన ఘనత డా.బి ఆర్ అంబేడ్కర్‌కి చెందుతుంది. ఆయన పుస్తకం "వెయిటింగ్ ఫర్ ఎ వీసా" కొలంబియా విశ్వవిద్యాలయంలో పాఠ్య పుస్తకంగా ఉంది.. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడి పేరుతోనైనా అత్యధిక సంఖ్యలో పాటలు, పుస్తకాలు ఉన్నాయంటే అది అంబేడ్కర్‌‌కి మాత్రమే.

 Alia Bhatt mehndi design: అలియాభట్ వెడ్డింగ్ మెహందీ డిజైన్స్.. మీరూ ట్రై చేయండి..


ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధుని విగ్రహాలు, పెయింటింగ్‌లలో బుద్ధుడు మూసిన కళ్లతో ఉంటాడు. కానీ డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ రూపొందించిన మొదటి పెయింటింగ్‌లో బుద్ధుడు కళ్లు తెరచి ఉంటాడు.  ప్రపంచ చరిత్రలో 8,50,000 మంది మద్దతుదారులతో బౌద్ధమతంలో డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ ప్రారంభించిన దీక్ష ప్రపంచంలోనే అతిపెద్ద మత మార్పిడి. డాక్టర్ అంబేడ్కర్‌‌ను బౌద్ధమతానికి ప్రారంభించిన గొప్ప బౌద్ధ సన్యాసి మహంత్ వీర్ చంద్రమణి "ఈ యుగపు ఆధునిక బుద్ధుడు" అని పిలిచారు.  అంబేడ్కర్‌ 1956 డిసెంబర్ 6న న్యూ ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. అక్కడ ఆయనకు బౌద్ధ దహన సంస్కారాలు జరిగాయి. 1990లో అంబేడ్కర్‌‌ను మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు.
Published by:Veera Babu
First published:

Tags: Ambedkar, India, Inequality, Leaders

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు