Gold Rates Today: బంగారం ధరలు పైపైకి.. అయినా కొనేస్తే మేలే..!

Gold Rates Today | బుధవారం నాడు ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి.. రూ.38,820కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగానే పెరుగుతున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 4:49 PM IST
Gold Rates Today: బంగారం ధరలు పైపైకి.. అయినా కొనేస్తే మేలే..!
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 4:49 PM IST
బంగారం కొనేవారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో లేనంతగా రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాడు ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి.. రూ.38,820కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగానే పెరుగుతున్నాయి. రూ.1,140 ఎగబాకి.. కిలో వెండి రూ.45,040కు చేరుకుంది. కాగా, ఈ రోజు హైదరాబాద్‌లో 10 గ్రాముల(22 కేరెట్ల) బంగారం ధర రూ.36,010గా ఉండగా, 24 కేరెట్ల ధర రూ.39,280గా ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ధరలు దీపావళి నాటికి ఊహించని విధంగా రూ.40 వేలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తదితర కారణాలు భారత్‌లో బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెడితే ఆర్థిక మాంద్యం వస్తే తీవ్రంగా నష్టపోతామని భయపడుతున్న ఇన్వెస్టర్లు.. బంగారం రూపంలో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. రూపాయి బలపడుతుండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.

ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా భారీస్థాయిలో బంగారం కొంటోందని నిపుణులు చెబుతున్నారు. అక్టోబరు, నవంబరు నాటికి ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. మరోవైపు, ధర ఎంత పెరుగుతున్నా.. కొనుగోలు చేస్తే నష్టం లేదని ప్రముఖ పెట్టుబడిదారు మార్క్‌ మొబియస్‌ సలహా ఇస్తున్నారు. మొత్తం పెట్టుబడుల్లో 10 శాతాన్ని బంగారంపై పెట్టుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

ఈ నెలలో బంగారం ధర ఆరేళ్ల గరిష్ఠానికి చేరిన తరుణంలో ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలంలో బంగారానికి ఢోకా లేదని, పసిడి ధర పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో తమ పెట్టుబడుల్లో 10 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చని చెప్పారు. బిట్‌ కాయిన్ల వంటి క్రిప్టో కరెన్సీల పాత్ర పెరుగుతున్న కొద్దీ సంప్రదాయ బులియన్‌ వినియోగం పెరుగుతుందనీ ఆయన అభిప్రాయపడ్డారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...