హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral LinkedIn Post: వావ్.. మహిళ ఐడియా అదిరింది.. ఉద్యోగం కోసం కేక్‌పై రెజ్యూమ్‌!

Viral LinkedIn Post: వావ్.. మహిళ ఐడియా అదిరింది.. ఉద్యోగం కోసం కేక్‌పై రెజ్యూమ్‌!

Photo Credit : (LinkedIn/Karly Pavlinac Blackburn)

Photo Credit : (LinkedIn/Karly Pavlinac Blackburn)

Viral LinkedIn Post: ఓ మహిళ నైకీ కంపెనీలో ఉద్యోగం కోసం యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు విభిన్నంగా కేక్‌(cake)పై రెజ్యూమ్‌ను ప్రింట్ చేసి పంపింది. ఈ విషయాన్ని ఆమె నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌పాం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఏ సంస్థలో ఉద్యోగాని (Job)కైనా అప్లై చేసుకొనే ముందు అభ్యర్థి తప్పనిసరిగా రెజ్యూమ్‌ (Resume)ను పంపాల్సి ఉంటుంది. రెజ్యూమ్‌ ఆధారంగానే తక్కువ సమయంలో రిక్రూటర్స్‌ అభ్యర్థులను అంచనా వేస్తారు. తర్వాత రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ చేపడతారు. ఉద్యోగం సంపాదించే ప్రాసెస్‌లో రెజ్యూమ్‌(Resume)లు కీలకం. అందుకే వీటికి ఎట్రాక్టివ్‌గా రూపొందించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఓ మహిళ నైకీ కంపెనీ (Nike Company)లో ఉద్యోగం కోసం యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు విభిన్నంగా కేక్‌(cake)పై రెజ్యూమ్‌ను ప్రింట్ చేసి పంపింది. ఈ విషయాన్ని ఆమె నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌పాం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేసింది. ఆమె పోస్ట్‌కు ఇంటర్నెట్‌ యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్ అనే మహిళ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో.. కొన్ని వారాల క్రితం తాను కేక్‌పై రాసిన రెజ్యూమ్‌ని నైకీ కంపెనీకి పంపినట్లు పేర్కొంది. సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఆమె లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో వివరించింది.

నైకీ కంపెనీ టీం ప్రస్తుతం ఎలాంటి పోస్ట్‌లకు రిక్రూట్‌ చేసుకోవడం లేదని తెలిపింది. అయితే తన గురించి నైకీ కంపెనీ టీంకి తెలియజేయాలని భావించి విభిన్న మార్గాల కోసం ఆలోచించినట్లు చెప్పింది. అందుకే కేక్‌పై రెజ్యూమ్‌ ప్రింట్‌ చేసి పంపినట్లు వివరించింది. నైకీ కంపెనీ హెడ్‌ ఆఫీసులో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో ప్రశ్నించింది. కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్ పోస్ట్‌ ఇప్పుడు నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌గా మారింది.

* ఉద్యోగం కోసం తపన

కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్ చెప్పినట్లుగానే నైకీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనే తపనతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. స్టాండర్డ్ జాబ్ అప్లికేషన్‌ను సమర్పించడం కంటే కేక్ పైన తన రెజ్యూమ్‌ని ప్రింట్ చేసి, ఒరెగాన్‌లోని బీవర్టన్‌లోని నైక్ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్‌కు మెయిల్ చేయమని స్నేహితురాలు బ్లాక్‌బర్న్‌కి సూచించింది. ఆమె సలహా తీసుకున్న తర్వాత కాస్త రీసెర్చ్ చేసిన బ్లాక్‌బర్న్‌.. నైకీ కంపెనీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌లో వేడుక జరుగుతుందని తెలిసిన రోజే కేక్‌పై రెజ్యూమ్‌ ప్రింట్‌ చేసి పంపాలని నిర్ణయం తీసుకుంది.

* పోస్ట్‌పై మిశ్రమ స్పందన

బ్లాక్‌బర్న్‌ కేక్‌పై రెజ్యూమ్ ప్రింట్‌ చేసి ఉద్యోగం కోసం పంపడంపై సామాజిక మాధ్యామాల్లో మిశ్రమ స్పందన ఎదురవుతోంది. కొంతమంది ఇంటర్నెట్‌ యూజర్లు ఆమె ఆలోచనను మెచ్చుకున్నారు. కంపెనీ యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు అద్భుతమైన కాన్సెప్ట్ అని అన్నారు. మరికొంత మంది బ్లాక్‌బర్న్‌ చర్యలు 'జిమ్మిక్'గా పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌కు స్పందిస్తూ ఓ యూజర్‌.. మా మొదటి ఇంటర్వ్యూ ప్రశ్న: చాక్లెట్ కేక్ లేదా ఎల్లో? అని చమత్కరించాడు. మరొకరి LOL అని స్పందించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Linkedin, Resume, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు