Tirupati Tour: తిరుపతి వెళ్తున్నారా? లోకల్ టూర్ కోసం ఏపీ టూరిజం ప్యాకేజీలివే

Tirupati Local Tour | ఈ ప్యాకేజీ టూర్లన్నీ తిరుపతి నుంచే ప్రారంభం అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులను శ్రీనివాసంలోని ఏపీటీడీసీ ఆఫీస్ దగ్గర పికప్ చేసుకొని, తిరిగి అక్కడే డ్రాప్ చేస్తారు.

news18-telugu
Updated: December 23, 2019, 4:44 PM IST
Tirupati Tour: తిరుపతి వెళ్తున్నారా? లోకల్ టూర్ కోసం ఏపీ టూరిజం ప్యాకేజీలివే
Tirupati Tour: తిరుపతి వెళ్తున్నారా? లోకల్ టూర్ కోసం ఏపీ టూరిజం ప్యాకేజీలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునేవారికి ప్రత్యేకమైన ప్యాకేజీలను రూపొందించింది ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APTDC. తిరుపతి నుంచి సమీపంలో ఉన్న ఆలయాలన్నీ కవర్ అయ్యేలా ఈ ప్యాకేజీలను అందిస్తోంది. మొత్తం నాలుగు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. తిరుపతి చేరుకునే భక్తులు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈ ప్యాకేజీలను బుక్ చేసుకొని ఇతర ఆలయాలనూ సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీలకు వేర్వేరు ధరలున్నాయి.

మొదటి ప్యాకేజీ వివరాలు చూస్తే తిరుపతి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ టూర్ ఒక రోజులో పూర్తి చేయొచ్చు. ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలకు టూర్ మొదలవుతుంది. తిరుపతిలోని ఆలయాలతో పాటు కాణిపాకం వరసిద్ధివినాయక ఆలయం, వేలూరులోని నారాయణి గోల్డెన్ టెంపుల్ సందర్శించొచ్చు. ప్యాకేజీ ధర పెద్దలకు రూ.600. పిల్లలకు రూ.500.

రెండో ప్యాకేజీ రెండు రోజుల ట్రిప్ కవర్ చేస్తుంది. తిరుపతి నుంచి బయల్దేరి హార్స్‌లీ హిల్స్, తలకోన ప్రాంతాలను సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.3.200. పిల్లలకు రూ.2,400. ప్యాకేజీలో ప్రయాణ ఖర్చులు, భోజనం, హోటల్‌లో బస ఏర్పాట్లు కవర్ అవుతాయి.

మూడో ప్యాకేజీలో తమిళనాడులోని ఆలయాలను కూడా సందర్శించొచ్చు. ఇది కూడా రెండు రోజుల ప్యాకేజీ. ఇందులో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తణి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ.2,200. పిల్లలకు రూ.1,850.



నాలుగో ప్యాకేజీ మూడు రోజుల ట్రిప్‌తో అందిస్తోంది ఏపీటీడీసీ. ఇందులో శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం, బెలూం గుహలు కవర్ అవుతాయి. పెద్దలకు రూ.4,000. పిల్లలకు రూ.3,400.

ఈ ప్యాకేజీ టూర్లన్నీ తిరుపతి నుంచే ప్రారంభం అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులను శ్రీనివాసంలోని ఏపీటీడీసీ ఆఫీస్ దగ్గర పికప్ చేసుకొని, తిరిగి అక్కడే డ్రాప్ చేస్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్: 9848007033, 9848802099, 0877 2289123/2289120.

Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీ... ధర తక్కువే

IRCTC: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ఫ్లైట్‌లో తిరుపతి వెళ్లండి ఇలా

Tirumala Tickets: తిరుమల 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే

 
First published: December 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు