TIME TRAVELLING MAN CLAIMS TO KNOW ABOUT THE APOCALYPSE WORLD DESTRUCTION HE HAS A PHOTOGRAPHIC PROOF SK
'ఆదిత్య 369' లాగే ఇతడు భవిష్యత్‌లోకి వెళ్లాడట..5000లో ప్రపంచం మటాష్.. ఇదిగో ప్రూఫ్
ఆధారాలను చూపిస్తున్న ఎడ్వర్డ్ (Image:ApexTV/Youtube))
తాను ట్రైమ్ ట్రావెల్ మిషన్ సాయంతో 3000 ఏళ్లు ముందుకు వెళ్లి చూశానని.. కానీ ఇప్పుడున్న ప్రపంచం కనిపించలేదని ఎడ్వర్డ్ చెబుతున్నారు. 'ApexTV' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
టైమ్ ట్రావెలింగ్ గురించి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో మన తెలుగు వారికి బాగా సుపరిచితమైన సినిమా ఆదిత్య 369. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 1991 విడుదలయింది. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఆదిత్య 369 ఎన్నో సంచలనాలు సృష్టించింది. అందులో టైమ్ మెషీన్ సాయంతో భూత, భవిష్యత్ కాలంలోకి వెళ్తారు బాలకృష్ణ. భవిష్యత్‌లో ఇలా ఉండబోతుందని చూపించారు. ఐతే అచ్చం అలాగే తాను ట్రావెల్ మెషీన్లో భవిష్యత్‌కు వెళ్లానని ఓ వ్యక్తి చెబుతున్నాడు. అక్కడ తనకు ఆసక్తికర విషయాలు తెలిశాయని.. 5000 సంవత్సరంలో ఈ ప్రపంచమే ఉండదని అతడు తెలిపాడు. అంతా నాశనమవుతుందని వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
తాను ట్రైమ్ ట్రావెల్ మిషన్ సాయంతో 3000 ఏళ్లు ముందుకు వెళ్లి చూశానని.. కానీ ఇప్పుడున్న ప్రపంచం కనిపించలేదని ఎడ్వర్డ్ చెబుతున్నారు. 'ApexTV' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడో 2018 సంవత్సరంలో చేసిన ఆ యూట్యూబ్ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తాను భవిష్యత్‌లోకి వెళ్లినప్పుడు.. చాలా షాకింగ్ విషయాలు కనిపించాయని ఎడ్వర్డ్ అందులలో వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచంలోని ప్రముఖ నగరాన్నీ నీట మునిగి ఉన్నాయని చెప్పారు ఎడ్వర్డ్. అంతేకాదు దీనికి సంబంధించి తన వద్ద ప్రూఫ్ కూడా ఉందంటున్నాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం మొత్తం నీటితో మునిగి పోయి ఉందంటూ ఓ ఫొటోగ్రాఫ్‌ను చూపించాడు.
2004లో ఓ సీక్రెట్ మిషన్ ద్వారా టైమ్ ట్రావెల్ గురించి అధ్యయనం చేస్తూ భవిష్యత్‌లోకి వెళ్లినట్లు ఎడ్వర్డ్ పేర్కొన్నారు. తాను భవిష్యత్ లోకి వెళ్లినపుడు తాను ఒక చెక్క ప్లాట్ ఫామ్ మీద నుంచొని ఉన్నానని.. ఇది ఏంటా అని ఆశ్చర్యపోయి చూశానని చెప్పారు. అప్పుడు తాను ఉన్నది లాస్ఏంజిల్స్ నగరమని.. కానీ అది పూర్తిగా నీట మునిగి ఉందని తెలిపారు. ఐతే యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఎడ్వర్డ్ ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. అతడికి ఇబ్బందులు రావొచ్చన ఉద్దేశంతో ముఖాన్ని చూపించకుండా బ్లర్ చేశారు. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో మరింత మందికి చేరువవుతోంది. దీని గురించే అంతటా చర్చ జరుగుతోంది.
ఎడ్వర్డ్ మాత్రమే కాదు గతంలో చాలా మంది టైమ్ ట్రావెలర్ గురించి చెప్పారు. టిక్‌టాక్ ఫ్యూచర్ టైమ్ ట్రావెలర్ అనే యూజర్.. భూమిపై వింత జీవులు కనిపించాయని, మనుషులు, వాటికి మధ్య భీకర పోరాటం జరుగుతుందని వివరించారు. ఐతే శాస్త్రవేత్తలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని ఖండిస్తున్నారు. కేవలం సినిమాలు, పుస్తకాల్లో మాత్రమే ఇలాంటివి సాధ్యమని అభిప్రాయపడుతున్నారు. అంతేతప్ప ట్రైమ్ ట్రావెలింగ్‌లో నిజం లేదని అంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.