Home /News /trending /

TIME TO MEET AND GREET THIS ROBOTIC MARVEL ANNAPURNA AT DURGA PUJA PANDALS THIS FESTIVE SEASON HERE IS ALL YOU NEED TO KNOW GH SRD

Annapurna Robot: గుడిలో హైటెక్ రోబో.. పూజ మండపం వద్ద సేవలు.. దీని ప్రత్యేకతలు ఇవే..

Annapurna Robot: గుడిలో హైటెక్ రోబో.. పూజ మండపం వద్ద సేవలు.. దీని ప్రత్యేకతలు ఇవే..

Annapurna Robot: గుడిలో హైటెక్ రోబో.. పూజ మండపం వద్ద సేవలు.. దీని ప్రత్యేకతలు ఇవే..

Annapurna Robot: అన్నపూర్ణ రోబోపై సౌరవ్ గంగూలీ ఆటోగ్రాఫ్‌ కూడా కనిపిస్తుంది. నిపుణుల బృందం రిమోట్‌గా దీనిని ఆపరేట్ చేస్తారు. సెమీ-హ్యూమనాయిడ్ బట్లర్ రోబోగా పిలిచే ఈ హై-టెక్ రోబో చాలా పనులను చేయగలదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
మన దేశంలో పండుగల సీజన్ (Festival Season) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 26 నుంచి దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ సమయంలో ప్రజలు జగన్మాత అయిన అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి దేవాలయాలు లేదా మండపాలకు వెళ్లనున్నారు. అయితే కోల్‌కతా(Kolkata)లోని మండపాలకు వెళ్లే భక్తులకు ఈసారి ఒక ప్రత్యేకమైన అనుభూతి లభించనుంది. ఈసారి ఒక స్వదేశీ రోబో (Robot) భక్తులకు అమ్మవారి మండపం (Pandal)లోకి సాదరంగా స్వాగతం పలకనుంది. దీని పేరు అన్నపూర్ణ (Annapurna). ఇది పూజ మండపంలోకి వచ్చిన భక్తులను పలకరిస్తుంది. వారితో కొన్ని మాటలు కూడా మాట్లాడగలగుతుంది. దుర్గాదేవి (Goddess Durga)కి పూజా నైవేద్యాలను కూడా తీసుకెళ్తుంది. దీని గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దమ్ డమ్ పార్క్ సమీపంలోని దక్షిణాపర దుర్గోత్సవ్‌లో ఉన్న అమ్మవారి మండపంలో ఈ అన్నపూర్ణ హైటెక్ రోబో (Hi-tech Robot) ఉంటుంది. కోల్‌కతాలోని స్టార్టప్ బిజినెస్ థింక్ ఎగైన్ ల్యాబ్ (Think Again Lab) ఈ రోబోని డెవలప్ చేసింది. ఇది ఇప్పటికే పాపులర్ టీవీ షోస్‌, బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో కనిపించింది. * ఎన్నో ప్రత్యేకతలు ఈ అన్నపూర్ణ రోబోపై సౌరవ్ గంగూలీ ఆటోగ్రాఫ్‌ కూడా కనిపిస్తుంది. నిపుణుల బృందం రిమోట్‌గా దీనిని ఆపరేట్ చేస్తారు. సెమీ-హ్యూమనాయిడ్ బట్లర్ రోబోగా పిలిచే ఈ హై-టెక్ రోబో చాలా పనులను చేయగలదు. దీనిని 2019లో స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 5 అడుగుల 4 అంగుళాల హైట్ ఉండే ఈ రోబో చక్రాలపై కదులుతుంది. లోకల్‌గానే తయారుచేసిన ఈ రోబో ఏకంగా 63 భాషలను అర్థం చేసుకొని ఆ 63 భాషల్లో స్పందిస్తుంది. ఇందులో సెన్సింగ్ విజన్‌ ఆఫర్ చేశారు. ఇది మ్యాపింగ్ టెక్నాలజీతో ఒక ప్రాంతానికి సంబంధించి లోకలైజ్డ్ 3D మ్యాప్‌ను క్రియేట్ చేసుకుంటుంది. క్లోజ్డ్ వాతావరణంలో ఇది మ్యాప్ క్రియేట్ చేసుకుని అటూ ఇటూ కదల గలదు కానీ ఓపెన్ ప్లేస్‌లో ఇది సరిగా పని చేయదు. అందువల్ల నిపుణులు దీనిని రిమోట్‌గా కంట్రోల్ చేస్తారు. పూజ మండపంలో అన్నపూర్ణ ఈసారి చాలా ప్రత్యేకంగా నిలవనుంది. ఇక్కడ పూజారులు పూజలు చేయడం మొదలెట్టి 62 ఏళ్లు అవుతోంది. అయితే ఇంతకు ముందెన్నడూ లేని అనుభూతిని ఇప్పుడు భక్తులకు అందించి వారిని ఆశ్చర్యపరచనున్నారు మండప నిర్వాహకులు. ఇది కూడా చదవండి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడి.. నిత్యపూజలు చేస్తున్న వ్యక్తి.. ఎందుకంటే.. * ఎవరు తయారు చేశారు? కిచెన్ నుంచి కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేసేందుకు ఈ అన్నపూర్ణ రోబోను థింక్ ఎగైన్ ల్యాబ్ వారు డెవలప్ చేశారు. 2019లో ఇలాంటి ఒక బట్లర్ రోబో తయారు చేయాలని వారు మొదటగా ఒక మల్టీ నేషనల్ కంపెనీ కలిశారు. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఈ కంపెనీ సొంతంగా దీన్ని తయారు చేసి తన సత్తా చాటింది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Durga Pooja, Kolkata, Navaratri, Robot, Sourav Ganguly, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు