Time Collapse : టైమ్ లాప్స్ వీడియోలకు ట్విస్ట్ ఇస్తున్న ఫిల్మ్‌మేకర్...

Time Collapse : అందరూ చేసినట్లే తానూ వీడియోలు చెయ్యడం అతనికి నచ్చలేదు. టైమ్ కొలాప్స్ అనే కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 6:14 AM IST
Time Collapse : టైమ్ లాప్స్ వీడియోలకు ట్విస్ట్ ఇస్తున్న ఫిల్మ్‌మేకర్...
టైమ్ కొలాప్స్ వీడియోలో దృశ్యం (Image : Vimeo - Cy Kuckenbaker)
  • Share this:
Kuckenbaker : ఆర్టిస్ట్, ఫిల్మ్‌మేకరైన కుక్కెన్‌ బాకెర్... తన షార్ట్‌ ఫిల్ముల్లో టైమ్ లాప్స్ ఫొటోగ్రఫీకి కొత్తదనాన్ని జోడిస్తున్నాడు. దీన్ని అతడు టైమ్ కొల్లాప్స్ (Time Collapse) అంటున్నాడు. ఆ వీడియోలను మన కళ్లతో చూస్తే... వాటిలో టైమ్ లాప్స్ చేసినట్లు కనిపించదు. ఎలాంటి CG గ్రాఫిక్సూ వాడలేదు. కానీ... ఒరిజినల్‌గా తీసిన వీడియోల్లో కొన్నింటిని వేరు చేసి... ఒక చోటికి తేవడం వల్ల ఏర్పడుతున్న కొత్త వీడియో... ఆశ్చర్యపరుస్తోంది. 2006లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్ట్స్, ఫిల్మ్ డైరెక్షన్ నేర్చుకున్న కుక్కెన్... ప్రస్తుతం ఫిక్షన్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీస్తున్నాడు. న్యూయార్క్ మోమా, ప్యారిస్ సెంటర్ పాంపిడౌ, వాంకోవర్ IFF, లాఫ్, వియన్నాలీ వంటి... చాలా దేశీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కుక్కెన్ బాకర్ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అంతేకాదు... శాండియాగో సిటీ కాలేజీలో ఫిల్మ్ మేకింగ్‌పై పాఠాలు కూడా చెబుతున్నాడు కుక్కెన్ బాకెర్.







Published by: Krishna Kumar N
First published: August 16, 2019, 6:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading