ఆకుకూరతో టిక్‌టాక్‌ని ఊపేసింది... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో

ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ... ఆమె చకచకా పచ్చి ఆకుకూరను తినేసింది. ఆ 15 సెకండ్ల వీడియో ఇప్పటికే 2.5 లక్షల మంది హృదయాల్ని గెలుచుకుంది.

news18-telugu
Updated: January 13, 2020, 9:01 AM IST
ఆకుకూరతో టిక్‌టాక్‌ని ఊపేసింది... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో
ఆకుకూరతో టిక్‌టాక్‌ని ఊపేసింది... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో (credit - tiktok - Fresh)
  • Share this:
టిక్ టాక్ షార్ట్ వీడియో మెసెజ్ యాప్ వచ్చాక... ఇలాంటి వీడియోలు దుమ్మురేపుతున్నాయి. జస్ట్ 15 సెకండ్లే వీడియో ఉండటంతో... ఒక్కొక్కరూ ఆ వీడియోల్ని రెండు మూడు సార్లు చూసేస్తున్నారు. ఫలితంగా అవి వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అందులో ఓ మహిళ... విమానంలో ప్రయాణిస్తూ... తన బ్యాగ్ లోంచీ... ఓ పచ్చి ఆకుకూరను బయటకు తీసి అలా తినేసింది. టిక్ టాక్ యూజర్ మొల్లీ మెక్‌గ్ల్యూ అది వీడియో తీసి... టిక్ టాక్‌లో పోస్ట్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా... "అయామ్ సో ఫ్రెష్" అనే సాంగ్ ప్లే చేశాడు. అంతే అది వైరల్ అయ్యింది. వామ్మో... పచ్చి ఆకుకూరను ఎవరైనా ఇలా తింటారా అంటూ... ఆశ్చర్యపోతూ చాలా మంది ఈ వీడియోని ఇతరులకు షేర్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్ల తుఫాన్ వస్తోంది. ఇప్పటికే ఈ వీడియోని మూడు రోజుల్లో 37 లక్షల మంది చూడగా... దీనికి 2.5లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 1900 మంది కామెంట్లు రాశారు.
@molly.mcglewMy family is crazy and I finally captured it on video guys #celeryonaplane #fyp #BYOC #familycam

♬ Fresh - Lemar

ఇంతకీ ఆమె ఏం ఆకుకూరను తిన్నాది అని చాలా మంది డౌట్ అడుగుతున్నారు. ఆమె తిన్నది సెలెరీ. ఇదో మంచి పోషకాలు ఉన్న ఆహారం. మనమైతే దీన్ని వండుకొని తింటాం. పచ్చిది కూడా తినవచ్చు. జంతువులైతే... పచ్చిగా ఉండే సెలెరీని తింటాయి. ఈ రోజుల్లో పచ్చిగా ఉండే ఆకుకూరలు, కూరగాయల్ని తినే సంస్కృతి పెరుగుతోంది. అందులో భాగంగానే ఆమె కూడా అలా తినేసిందని అనుకోవచ్చు. కాకపోతే... అంత వేగంగా... కరకరలాడిస్తూ కొరికి కొరికి తింటుండటం చూసి... అంతా ఆశ్చర్యపోతూన్నారు.
First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు