Home /News /trending /

TIKTOK STAR HAREEM SHAH SAYS SHE LEFT LIP FILLER TREATMENT MIDWAY IN VIRAL VIDEO PVN

Viral Video : అందమైన పెదాల కోసం.. సర్జరీకి వెళ్లిన టిక్ టాక్ స్టార్..సీన్ రివర్స్ అయి ఇప్పుడిలా

టిక్ టాక్ స్టార్ హరీమ్ షా(అప్పుడలా,ఇప్పుడిలా)

టిక్ టాక్ స్టార్ హరీమ్ షా(అప్పుడలా,ఇప్పుడిలా)

Hareem Shah lip filler treatment : అందమైన పెదాల ఆకృతి కోసం లండన్ వెళ్లిన ఆ టిక్ టాక్ స్టార్ పెదాలు ఇప్పుడు ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి. యూకేలో డాక్టర్‌ ను కలిసిన హరీమ్‌ షా.. తన పెదవికి ఫిల్లర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రారంభించింది. అయితే ఇంతలో హరీమ్‌ షాకి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది.

ఇంకా చదవండి ...
TikTok star lip filler treatment : తన పెదాల ఆకృతిని మార్చుకోవడానికి లండన్‌ వెళ్లిన ఓ టిక్ టాక్ స్టార్ కి చేదు అనుభవం ఎదురైంది. అందమైన పెదాల ఆకృతి కోసం లండన్ వెళ్లిన ఆ టిక్ టాక్ స్టార్ పెదాలు ఇప్పుడు ఉబ్బిపోయి వంకరగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇంతకీ ఎవరా టిక్ టాక్ స్టార్?అందమైన పెదాల ఆకృతి కోసం వెళ్లిన ఆ టిక్ టాక్ స్టార్ పెదాలు అంతా ఉబ్బిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్తాన్‌(Pakistan)కు చెందిన హరీమ్‌ షా(Hareem Shah).. టిక్‌టాక్‌ స్టార్‌. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల హరీమ్ షా..లిప్‌ ఫిల్లర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాలని భావించింది. ఇందుకోసం హరీమ్‌ షా యూకేకు వెళ్లింది. అందమైన పెదాల ఆకృతి కోసం బాగానే ఖర్చవుతుంది కావున అన్ని ఏర్పాట్లతో అక్కడికి చేరుకుంది హరీమ్‌ షా. పెద్ద మొత్తం నగదుతో పాకిస్తాన్ నుంచి యూకేకి ప్రయాణించినట్లు పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ ఫాంలో వీడియోను అప్‌ లోడ్ చేసింది. యూకేలో డాక్టర్‌ ను కలిసిన హరీమ్‌ షా.. తన పెదవికి ఫిల్లర్‌ ట్రీట్‌మెంట్‌( lip filler treatment) ప్రారంభించింది. అయితే ఇంతలో హరీమ్‌ షాకి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. పాకిస్తాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ మీ బ్యాంక్‌ ఖాతాలు స్థంభింపజేసింది అని హరీమ్ షాకి సమాచారం అందింది. దీంతో ఈ సర్జరీ ప్రక్రియ ఖరీదైనది కావడంతో దానిని మధ్యలోనే వదిలివేయాలని హరీమ్ షా నిర్ణయించుకుంది. డబ్బు చేతిలో లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో మధ్యలోనే సర్జరీ ప్రక్రియను విరమించుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సగం సర్జరీతో ఆమె ఇంటికి వెనుదిరగాల్సి వచ్చింది.

ALSO READ PM Modi Record : తగ్గేదే లే..యూట్యూబ్ లో మోదీ వరల్డ్ రికార్డు

హరీమ్ షా శనివారం అర్థరాత్రి ఉబ్బిన పెదవితో సోషల్ మీడియాలో కనిపించింది. అప్పటినుంచి ఆమె వార్తల్లో నిలిచింది. ఓ వీడియోలో హరీమ్ షా మాట్లాడుతూ.. డబ్బును పాకిస్తాన్ నుండి లండన్‌కు తీసుకువెళ్లడం ఇదే మొదటిసారి అని చెప్పింది. పాకిస్తాన్ రూపాయిలను యూరోలు లేదా డాలర్లుగా మార్చవలసి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బుందులు పడుతున్నారని, తన సమస్య గురించి చెబుతూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. పాకిస్థాన్ చట్టాలు పేదలకు మాత్రమే వర్తిస్తాయని హరీమ్ షా వాపోయింది.


ALSO READ Viral: సూప‌ర్ ఆఫ‌ర్‌.. 10 అడుగుల దోశ తింటే.. రూ.71,000 ప్రైజ్ మ‌నీ ట్రై చేస్తారా?


పాకిస్తాన్‌ ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ వెబ్‌సైట్‌ ప్రకారం.. ప్రయాణికులు పాకిస్తాన్‌ కు ఏ కరెన్సీ అయినా, ఎంతైనా తీసుకురావచ్చు. అలాగే ఎలాంటి షరతులు లేకుండా పదివేల డాలర్ల వరకు విదేశీ కరెన్సీని సైతం విదేశాలకు తీసుకెళ్లవచ్చు. కానీ అంతకు మించి భారీ మొత్తాన్ని తీసుకెళ్లాలంటే మాత్రం అనుమతి పొందడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో హరీమ్‌ షా.. పెద్ద మొత్తంలో నగదు తీసుకుని పాకిస్తాన్‌ నుంచి యూకేకు ప్రయాణించినందునే ఆమెపై మనీలాండరింగ్‌ విచారణ జరుపుతున్నట్లు ఎఫ్‌ఐఏ స్పష్టం చేసింది. జనవరి 12న ఎప్ఐఏ ఆమెపై మనీలాండరింగ్ విచారణ ప్రారంభించింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pakistan, Tiktok, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు