Home /News /trending /

Dazhariaa Quint Noyes: ప్రముఖ TikTok స్టార్ ఆత్మహత్య.. చనిపోయే ముందు ఇన్‌స్టాలో వీడియో

Dazhariaa Quint Noyes: ప్రముఖ TikTok స్టార్ ఆత్మహత్య.. చనిపోయే ముందు ఇన్‌స్టాలో వీడియో

Image-Instagram

Image-Instagram

టిక్ టాక్ ద్వారా చాలా మంది తమలోని ట్యాలెంట్‌ను బయటి ప్రపంచానికి తెలిసేలా చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు.

    టిక్ టాక్ ద్వారా చాలా మంది తమలోని ట్యాలెంట్‌ను బయటి ప్రపంచానికి తెలిసేలా చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇలా ఫేమ్ సంపాదించుకున్న కొందరు.. అర్ధాంతరంగా తమ జీవితాలకు ముగింపు చెప్తున్నారు. మానసిక ఒత్తడిని భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్ దజారియా క్వింట్ నోయేస్(Dazhariaa Quint Noyes) కూడా ఆత్మహత్య చేసకుంది. లూసియానాకు చెందిన 18 ఏళ్ల దజారియా.. టిక్‌టాక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. Bxbygirlldee ఐడీ పేరిట వీడియోలు పోస్ట్ చేసే ఆమెను DEEగా ఫాలోవర్స్ పిలుచుకుంటారు. టిక్‌టాక్‌లో యాక్టివ్‌గా ఉంటే ఆమెకు 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 112,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్ ద్వారానే ఆమె బ్యూటీ షాప్‌ను రన్ చేస్తోంది. ఇక, యూట్యూబ్‌లో కూడా ఆమె చానల్‌లో పెద్ద సంఖ్యలో సబ్‌స్కైబర్స్ ఉన్నారు.

    అయితే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన దజారియా.. దానికి ఇదే నా చివరి పోస్టు అనే క్యాప్షన్ జత చేశారు. ఆ వీడియోలో ఆమె డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ కనిపించారు. ఆ తర్వాతనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు కూడా ధ్రువీకరించారు. ఫిబ్రవరి 10వ తేదీన దజారియా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి నిర్ధారించిందని డెయిలీ మెల్ పేర్కొంది.



    ఇక, దజారియా మృతి వార్త తెలుసుకున్న ఆమె ఫాలోవర్స్ చాలా మంది షాక్‌లో ఉండిపోయారు. ఈ విషయం తమను ఎంతగానో బాధించిందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Suicide, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు