హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Most downloaded apps: 2021లో అత్యధిక డౌన్​లోడ్స్​ సాధించిన యాప్స్​ ఇవే.. TikTok​కు కాసుల పంట

Most downloaded apps: 2021లో అత్యధిక డౌన్​లోడ్స్​ సాధించిన యాప్స్​ ఇవే.. TikTok​కు కాసుల పంట

Year Ender 2021: 2021లో టాప్ 10 మొబైల్ యాప్స్ ఇవే.. ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించేలా..

Year Ender 2021: 2021లో టాప్ 10 మొబైల్ యాప్స్ ఇవే.. ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించేలా..

సెన్సార్ టవర్ సంస్థ వివిధ కేటగిరీల్లో నిలిచిన టాప్​ యాప్స్​ జాబితాలను వెల్లడించింది. 2021లో మోస్ట్​ పాపులర్​, అత్యధిక మంది డౌన్​లోడ్​ చేసుకున్న యాప్​గా టిక్​టాక్​ నిలిచింది. అంతేకాదు, అత్యధిక రెవెన్యూ సాధించిన యాప్​గానూ టిక్​టాక్​ రికార్డు సృష్టించింది.

ఇంకా చదవండి ...

2021 సంవత్సరం దాదాపు ముగింపుకు చేరుకున్నాం. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది కూడా అనేక మొబైల్​ యాప్స్​ తమ హవా కొనసాగించాయి. తాజాగా సెన్సార్ టవర్ సంస్థ వివిధ కేటగిరీల్లో నిలిచిన టాప్​ యాప్స్​ జాబితాలను వెల్లడించింది. 2021లో మోస్ట్​ పాపులర్​, అత్యధిక మంది డౌన్​లోడ్​ చేసుకున్న యాప్​గా టిక్​టాక్​ నిలిచింది. అంతేకాదు, అత్యధిక రెవెన్యూ సాధించిన యాప్​గానూ టిక్​టాక్​ రికార్డు సృష్టించింది. కేవలం ఆండ్రాయిడ్​లోనే కాకుండా యాపిల్​ యాప్ స్టోర్‌లో కూడా అత్యధిక డౌన్‌లోడ్లను సాధించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్​ రెండు యాప్ స్టోర్లలో కలిపి కేవలం 2021 ఏడాదిలోనే 745.9 మిలియన్ డౌన్​లోడ్లను సాధించింది. 2020లో 980.7 మిలియన్ డౌన్​లోడ్స్​ను దక్కించుకుంది. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి 24 శాతం డౌన్​లోడ్స్​ తగ్గాయి.

టిక్​టాక్​కు ఎక్కువ మంది యూజర్లు ఉన్న భారత్​లో భద్రత కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ యాప్​ను నిషేధించింది. దీంతో టిక్‌టాక్ యాప్ డౌన్​లోడ్లు తగ్గాయి. అయినప్పటికీ, 2021లో మోస్ట్​ పాపులర్​ యాప్​గా నిలవడం ఆసక్తికరం. టిక్​టాక్​ తర్వాత మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. యాపిల్ యాప్ స్టోర్‌లో యూట్యూబ్​ రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

Helicopter Crash : ఎన్నో దుర్ఘటనలు.. హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరంటే


గూగుల్ ప్లేస్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్లు పొందిన యాప్ కేటగిరీలో ఫేస్​బుక్​ అగ్రస్థానంలో నిలిచింది. ఈ యాప్​ దాదాపు 500.9 మిలియన్ డౌన్​లోడ్​లను సాధించింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ రెండింట్లో కలిపి ఈ యాప్​ సుమారు 624.9 మిలియన్ డౌన్​లోడ్లను నమోదు చేసింది. గతేడాది ఫేస్​బుక్​ 707.8 మిలియన్ల డౌన్​లోడ్స్​ సాధించగా.. ఒక్క ఏడాదిలోనే 12 శాతం డౌన్​లోడ్స్​ తగ్గాయి. అయినప్పటికీ. ప్రపంచవ్యాప్తంగా దీని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు.

Tinder : వామ్మో! వీడియో డేటింగ్స్‌లో Hyderabad టాప్ -ఫోన్‌లోనే అన్నీ కానిచ్చేస్తున్నారు..


మోస్ట్​ పాపులర్​ గేమ్​గా గెరీనా ఫ్రీఫైర్..​

అత్యధిక వసూళ్లు చేసిన యాప్‌ల జాబితాలోనూ టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను యూట్యూబ్, పిక్కోమా, టిండర్, డిస్నీ ప్లస్, గూగుల్​ వన్​, పిక్కోమా, డిస్నీ ప్లస్​, టిక్​టాక్​, హెచ్​బీఓ మాక్స్ యాప్స్​ దక్కించుకున్నాయి. ఈ ఏడాది యాప్ స్టోర్, గూగుల్​ ప్లే అంతటా అత్యధిక వసూళ్లు సాధించిన గేమ్స్​ జాబితాలో పబ్జీ మొబైల్, హానర్ ఆఫ్ కింగ్స్, జెన్‌షిన్ ఇంపాక్ట్, కాయిన్ మాస్టర్, రోబ్లాక్స్ చోటు దక్కించుకున్నాయి.

actress lahari: టీవీ సీరియల్ నటి లహరి అరెస్ట్.. తీవ్రగాయాలు.. మద్యం మత్తులోనే అలా చేసిందా?


అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసిన గేమ్స్​లో గెరీనా ఫ్రీ ఫైర్, సబ్​వే సర్ఫేస్​, పబ్​జీ మొబైల్​, బ్రిడ్జ్ రేస్, రోబ్లాక్స్ గేమ్స్​ నిలిచాయి. ఈ యాప్​లో వివిధ సబ్​స్క్రిప్షన్ల కోసం యూజర్లు మొత్తం $133 బిలియన్​ డాలర్లను ఖర్చు చేశారు. 2020లో ఈ ఖర్చు $111.1 బిలియన్లగా ఉండేది. అంటే, యూజర్లు గేమింగ్​ యాప్స్​పై పెట్టే ఖర్చు ఒక్క ఏడాదిలోనే 19.7 శాతం వృద్ధి చెందింది.

First published:

Tags: Facebook, Mobile App, Tiktok

ఉత్తమ కథలు