హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

TikTok- ShareChat: టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఆ యాప్ కు పండగే పండగ.. వరదలా పెట్టుబడులు.. ఏకంగా ఎన్ని వేల కోట్ల విలువ అంటే..

TikTok- ShareChat: టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఆ యాప్ కు పండగే పండగ.. వరదలా పెట్టుబడులు.. ఏకంగా ఎన్ని వేల కోట్ల విలువ అంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

టిక్​టాక్​తో సహా 58 ఇతర చైనా యాప్స్​పై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ వీడియో షేరింగ్​ యాప్స్​కు డిమాండ్​ పెరుగుతోంది. వీటి డౌన్​లోడ్స్​ కూడా వేగంగా పెరుగుతున్నాయి.

టిక్​టాక్​ యాప్​ బ్యాన్​ అయిన తర్వాత దానికి సమానంగా భారత్​లో పాపులర్​ అయిన వీడియో షేరింగ్​ యాప్​ షేర్‌చాట్.. ఇది స్వదేశీ కంటెంట్-షేరింగ్ యాప్​ కావడంతో దీని యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భారత్​లో ఇంటర్నెట్​ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటం, పాపులర్​ టిక్​టాప్​ యాప్​ బ్యాన్​ కావడం షేర్​చాట్​కు కలిసొచ్చింది. దీంతో, ఈ వీడియో షేరింగ్​ యాప్​లో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ సంస్థలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా,​ అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్, స్నాప్ ఇంక్, ట్విట్టర్ ఇంక్ వంటి దిగ్గజ సంస్థలు 502 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు షేర్​చాట్​తో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో, షేర్​చాట్​ మార్కెట్​ విలువ 2 బిలియన్ డాలర్లకు(భారతీయ కరెన్సీలో దాదాపు 15వేల కోట్ల రూపాయలు) పైగా చేరనుంది.

దీనిపై షేర్​ చాట్​ స్పందిస్తూ “మా సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు అమెరికా వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు టైగర్ గ్లోబల్​, స్నాప్​ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. వీటి సహకారంతో మా యాప్​ను మరింత వృద్ధి చేయనున్నాం. టిక్​టాక్​ వంటి చైనీస్​ యాప్​ల బ్యాన్​తో భారత్​లో వీడియో షేరింగ్ ప్లాట్​ఫామ్​ల వృద్ధికి మంచి అవకాశాలున్నాయి. అందుకే, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి.” అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గత ఏడాది భారత్​ -చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఘర్షణ కారణంగా చైనాపై ఉక్కుపాదం మోపింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్​టాక్​తో సహా 58 ఇతర చైనా యాప్స్​పై నిషేధం విధించింది. తద్వారా, దేశీయ వీడియో షేరింగ్​ యాప్స్​కు డిమాండ్​ పెరుగుతోంది. వీటి డౌన్​లోడ్స్​ కూడా వేగంగా పెరుగుతున్నాయి. అందుకే, ఈ సోషల్ మీడియా యాప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

160 మిలియన్ల యూజర్లతో అగ్రస్థానంలో..

స్మార్ట్​ఫోన్​ వినియోగం వేగంగా పెరుగుతున్న భారత్​లో మోజ్ వంటి ఇతర ప్రముఖ వీడియో యాప్​లు పాపులర్ గా మారుతున్నాయి. ఈ రంగంలోకి కొత్త యాప్స్​ కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే, ప్రస్తుతం వీడియో షేరింగ్​ యాప్స్​లో అగ్రగామిగా కొనసాగుతున్న షేర్‌చాట్ విలువ ఈ కొత్త పెట్టుబడులతో 2.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యాప్​ను మరింత డెవలప్​ చేసేందుకు, యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు కొత్త పెట్టుబడులు ఉపయోగపడతాయి. దీనిపై షేర్‌చాట్ సిఈఓ అంకుష్ సచ్‌దేవా "ఈ పెట్టుబడులతో మేము మా వినియోగదారుల సంఖ్యను మరింతగా పెంచుకుంటాము.

దీంతో భవిష్యత్తులో అన్ని ప్రాంతీయ భాషల్లో మా యాప్​ను విస్తృతం చేయనున్నాం." అని అన్నారు. షేర్‌చాట్ యాప్‌లోకు భారతదేశంలో ప్రస్తుతం 160 మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇదే సంస్థ నిర్వహిస్తోన్న మోజ్‌ యాప్​కు 120 మిలియన్ల యూజర్లున్నారు. కాగా, భారత్​లో వీడియో షేరింగ్​ యాప్​లకు ఉన్న క్రేజ్​ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్​ కూడా దీనిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.

First published:

Tags: Tik tok

ఉత్తమ కథలు