• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • TIK TOK USER ROY LBAKER IMPERSONATES THE AUTOMATED RECORDING AT THE CIA AND SCARES AWAY THE SPAMMERS SSR GH

TikTok Creator: స్పామ్‌ కాలర్‌కు వణుకు పుట్టించిన టిక్‌టాకర్.. ఇంతకీ ఏం చేశాడంటే...

టిక్‌ టాక్‌ క్రియేటర్‌ రాయ్‌ ఎల్‌బేకర్‌

కొత్త నెంబరు నుంచి కాల్‌ వస్తే... ఆన్సర్ చేయకుండా ఉండలేం. తీరా ఫోన్ తీశాక స్పామ్‌ కాల్‌ అని తెలిసి ఉసూరుమంటూ కట్‌ చేస్తాం. ఇది కొంతమంది చేసే పని, ఇంకొందరైతే ఆ స్పామర్స్‌తోనే ఆటలాడతుంటారు. తిరిగి వాళ్లకే ఝలక్‌ ఇస్తుంటారు. అచ్చంగా ఇదే పని చేశాడు అమెరికాకు చెందిన ఓ టిక్‌టాక్‌ క్రియేటర్‌.

  • Share this:
ప్రతిరోజు ఫోన్‌కు బంధు మిత్రుల నుంచి ఎన్ని కాల్స్‌ వస్తున్నాయో.. స్పామ్‌ కాల్స్‌ కూడా అన్నే వస్తున్నాయని చాలామంది చెబుతుంటారు. అంతగా స్పామ్‌ కాల్స్‌ గొడవ పెరిగిపోయింది. కొత్త నెంబరు నుంచి కాల్‌ వస్తే... ఆన్సర్ చేయకుండా ఉండలేం. తీరా ఫోన్ తీశాక స్పామ్‌ కాల్‌ అని తెలిసి ఉసూరుమంటూ కట్‌ చేస్తాం. ఇది కొంతమంది చేసే పని, ఇంకొందరైతే ఆ స్పామర్స్‌తోనే ఆటలాడతుంటారు. తిరిగి వాళ్లకే ఝలక్‌ ఇస్తుంటారు. అచ్చంగా ఇదే పని చేశాడు అమెరికాకు చెందిన ఓ టిక్‌టాక్‌ క్రియేటర్‌. ఇంకేముంది అటువైపు నుంచి కాల్‌చేసిన వ్యక్తి కంగుతిన్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే...

స్పామ్‌ కాల్స్‌తో చాలా రకాల సమస్యలు వస్తాయి. ఒకటి అనవరసమైన చర్చ, రెండోది వాళ్ల మాటలు పొరపాటున నమ్మితే బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టేస్తారు. మొబైల్‌లో మాల్‌వేర్‌ చొప్పించి... ఇబ్బందులు పెడతారు. దీంతో స్పామ్‌కాల్స్‌ అంటే చాలా ఇబ్బంది అనిపిస్తోంది. అయితే స్పామర్లు మాత్రం తమ దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలా యూఎస్‌కు చెందిన టిక్‌ టాక్‌ క్రియేటర్‌ రాయ్‌ ఎల్‌బేకర్‌కి ఓ స్పామ్‌ కాల్‌ వచ్చింది. అయితే అతడు అందరిలా కాల్‌ అటెండ్‌ చేయడమో, కట్‌ చేయడమో చేయలేదు. తన బేస్‌ వాయిస్‌ను వాడుకొని వాళ్లను బెదరగొట్టాడు.

స్పామర్‌ కాల్‌ను అటెండ్‌ చేసిన రాయ్‌... అమెరికా పోలీసు విభాగానికి చెందిన సీఐఏలోని ఆటోమేటెడ్‌ కాల్‌ రికార్డింగ్‌ మెషీన్‌ తరహాలో మాట్లాడారు. ‘మీరు సీఐఏకు కాల్‌ చేసిందుకు ధన్యవాదాలు. మీ కాల్‌ స్పామ్‌, ఫ్రాడ్‌ డివిజన్‌కు వచ్చింది. ఇక్కడి ఏజెంట్లందరూ బిజీగా ఉన్నారు. మీకు మరింత సాయం అందించడానికి మీ కాల్‌ను కాసేపు హోల్డ్‌లో పెడతాం. ఈలోగా మీ ఇన్‌కమింగ్‌, ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ వివరాలు సేకరిస్తున్నాం. వాటిని మా డేటా బేస్‌తో పరిశీలించి మా ఏజెంట్‌ మీకు కాల్‌ చేస్తారు’ అని చెప్పాడు. దీంతో స్పామర్‌ కంగుతిని కాల్‌ కట్‌ చేసేశాడు.

ఈ మొత్తం వ్యవహారాన్ని రాయ్‌ రికార్డు చేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. రాయ్‌ సమయస్ఫూర్తికి, తెలివికి అందరూ లైక్‌లతో అభినందిస్తున్నారు. ఇప్పటివరకు ఆ వీడియోకు 10 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. చాలామంది ఆ వీడియో డౌన్‌లోడబుల్‌ వెర్షన్‌ కూడా అడుగుతున్నారు. అంతేకాదు ఆ వీడియోను డౌన్‌లోడ్‌ చేసి యూట్యూబ్‌ ఛానల్స్‌, ఇతర సోసల్‌ మీడియా ఛానల్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. రాయ్‌ వాయిస్‌ కమాండ్‌కు ఫ్యాన్స్‌ మంత్రముగ్ధులు కావడమే ఆ వీడియో వైరల్‌ అవ్వడానికి కారణం.
Published by:Sambasiva Reddy
First published: