Tik Tok Tragedy: ‘టిక్‌ టాక్’ కోసం ప్రమాదకర విన్యాసం..ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక వ్యక్తి

Tik Tok Tragedy | ‘టిక్ టాక్’ కోసం ప్రమాదకరమైన విన్యాసం చేస్తూ తీవ్రంగా గాయపడిన కర్ణాటక వ్యక్తి...ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు.

news18-telugu
Updated: June 24, 2019, 12:15 PM IST
Tik Tok Tragedy: ‘టిక్‌ టాక్’ కోసం ప్రమాదకర విన్యాసం..ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక వ్యక్తి
టిక్‌టాక్ కోసం రిస్కీ స్టంట్ చేస్తూ గాయపడిన కర్ణాటక వ్యక్తి
  • Share this:
టిక్ టాక్‌ వీడియో సరదా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కర్ణాటకకు చెందిన కుమార్(26) టిక్ టాక్ వీడియో కోసం ప్రమాదకరమైన విన్యాసం చేస్తూ వారం క్రితం తీవ్రంగా గాయపడడం తెలిసిందే. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సాహస విన్యాసం చేయడంతో ప్రమాదవశాత్తు అతని మెడపూస విరిగిపోయింది. మెడపూస విరిగిపోవడంతో అతను అఛేతనంగా మారాడు.

ఈ నెల 17 నుంచి బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన కుమార్ ఆదివారం కన్నుమూశాడు. దీంతో అతని స్వస్థలమైన తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా గూడెకెరెలో విషాదం నెలకొంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కొందరు యువకులు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.



First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు