Home /News /trending /

TIK TOK FILM FESTIVAL IN PUNE HAVE YOU SENT YOUR TIKTOK VIDEOS NK

Tik Tok : టిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్... ఎక్కడ జరుగుతోంది?... ఏంటి దాని ప్రత్యేకత?

టిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్ (Image :  Twitter -  Suyash )

టిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్ (Image : Twitter - Suyash )

Tik Tok Film Festival : బాలల చలన చిత్రోత్సవాల గురించి మీరు వినే ఉంటారు. ఇది పుణెలో జరుగుతున్న టిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇందులో గెలిచే వీడియోలకు మనీ ప్రైజెస్ కూడా ఉన్నాయి.

టిక్ టాక్ షార్ట్ వీడియో యాప్‌ ఇప్పుడో సంచలనం. చాలా మంది ఆ యాప్‌లో వీడియోల్ని చూస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీలవుతున్నారు. టిక్ టాక్‌‌లో వస్తున్న వీడియోలు ఇదివరకు ఎప్పుడూ లేనంత ఆనందాన్ని ఇస్తున్నాయని చాలా మంది చెబుతున్నారు. అంతే కాదు టిక్ టాక్ పుణ్యమా అని చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు. తమ టాలెంట్ ప్రదర్శిస్తూ... ప్రతి ఒక్కరూ తమ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. తాజా అప్‌డేట్ ఏంటంటే... పుణెలో టిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. వృత్తి రీత్యా ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ప్రకాష్ యాదవ్... ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్న వారిలో ఒకరిగా ఉన్నారు. ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తున్నారని ఆయన్ని అడిగితే... టిక్ టాక్ ఇప్పుడో ట్రెండ్ సెట్టర్ అన్న ఆయన... ప్రతి ఒక్కరూ టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారనీ, వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలనిపించి... టిక్ టాక్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదలుపెట్టామని తెలిపారు.


జులై 24న మొదలైన ఈ ఫెస్టివల్... ఆగస్ట్ 20 వరకూ కొనసాగనుంది. అప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ప్రకటిస్తారు. విజేతలకు ప్రైజ్ మనీతోపాటూ... ట్రోఫీ కూడా ఇస్తారు. మొదటి స్థానంలో నిలిచినవారికి రూ.33,333, సెకండ్ పొజిషన్‌లో ఉంటే రూ.22,222, థర్డ్ పొజిషన్ వారికి రూ.5,555 ఇవ్వబోతున్నారు. నాలుగో స్థానంలో నిలిస్తే రూ.3,333 ఇవ్వనున్నారు. అన్ని వయసుల వారూ ఈ పోటీలో పాల్గొన వచ్చు.

ఈ ఈవెంట్‌లో మొత్తం 12 కేటగిరీలున్నాయి. వాటిలో బెస్ట్ కామెడీ, బెస్ట్ ఎమోషన్, బెస్ట్ కపుల్ ఇలా ఉన్నాయి. వీటిలో సోషల్ అవేర్‌నెస్ కోసం ఓ కేటగిరీ, పర్యావరణ రక్షణకు సంబంధించి మరో కేటగిరీ కూడా ఉంది. ఇందులో పాల్గొన్నవారు గెలవకపోయినా... ట్రోఫీలూ, సర్టిఫికెట్లూ ఇస్తామని ప్రకాష్ యాదవ్ తెలిపారు. వీడియోల తయారీదారుల పట్ల ప్రజల్ల సదభిప్రాయం కలిగించేందుకే ఈ ఈవెంట్ స్టార్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
First published:

Tags: Maharashtra, Pune, Tik tok, Tiktok, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు