Tiger video : మనలో చాలా మంది ఓపెన్ టాప్ జీపుల్లో సఫారీకి వెళ్తారు. జూలో దూరం నుంచి చూసే వన్యమృగాల్ని అత్యంత దగ్గర నుంచి చూసేందుకు వీలవుతుందనీ.. తద్వారా థ్రిల్ ఫీల్ కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ సఫారీ అనేది అన్నిసార్లూ సాఫీగా సాగదు. వన్యమృగాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం. అవి తలచుకుంటే మనుషులపై ఇట్టే దాడి చెయ్యగలవు. సఫారీలో మనతో గైడ్లు ఉన్నా.. అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం అని ఓ వీడియో హెచ్చరిస్తోంది.
IFS ఆఫీసర్ సురేందర్ మెహ్రా తన ట్విట్టర్ అకౌంట్ @surenmehraలో నవంబర్ 27, 2022న ఓ వీడియోని పోస్ట్ చేశారు. "ఒక్కోసారి పులులను చూడాలనే మన అతి ఆతృత వల్ల ప్రయోజనం ఉండదు. పైగా వాటి నివాస ప్రాంతంలోకి మనం వెళ్లినట్లవుతుంది" అని క్యాప్షన్ ఇచ్చారు. నిజమే మరి. మనకు ఎలాగైతే ప్రైవసీ కావాలనిపిస్తుందో.. జంతువులకూ అలాగే అనిపిస్తుంది. వాటి అడవిలోకి మనం వెళ్తే.. వాటికి కోపం వస్తుంది.
ఈ వీడియోని గమనిస్తే.. ఓ పులి పొదల్లో దాక్కొని ఉంది. పర్యాటకుల సఫారీ వెహికిల్.. ఆ పులికి అతి దగ్గరలో ఉంది. పొదల మాటున పులి ఉందని వారు కనిపెట్టారు. దాన్ని వీడియో తియ్యడం మొదలుపెట్టారు. పులి అంత దగ్గరగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. వాళ్లు వెళ్లకుండా అలాగే ఉండటంతో.. ఆ పులి గర్జిస్తూ వారివైపు దూసుకొచ్చింది. దాడి చెయ్యబోయింది. అదిరిపడిన వారు కేకలు పెడుతూ దాన్ని తరిమారు. వెనక్కి తగ్గిన పులి.. తిరిగి పొదల్లోకి వెళ్లిపోయింది.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
Sometimes, our ‘too much’ eagerness for ‘Tiger sighting’ is nothing but intrusion in their Life…????#Wilderness #Wildlife #nature #RespectWildlife #KnowWildlife #ResponsibleTourism Video: WA@susantananda3 @ntca_india pic.twitter.com/B8Gjv8UmgF
— Surender Mehra IFS (@surenmehra) November 27, 2022
ఆ పులి వెళ్లిపోయింది కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే దాడి చేసి ఉంటే ఏమయ్యేది? ఇలాంటి చర్యలు ప్రాణాలకే ప్రమాదం. అందుకే నెటిజన్లు దీనిపై ఆగ్రహంతో స్పందిస్తున్నారు. "అది బాధ్యతారాహిత్యం" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "దీన్ని చూస్తే గుండె ఆగినంతపనైంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
"పులులకు చాలా పెద్ద అడవి ఉండాలి. వాటి ప్రదేశంలోకి మనం వెళ్లకూడదు. వాటిని ప్రశాంతంగా ఉండనివ్వాలి. మన ఆనందం కోసం మనం ఇలా వెళ్లడం కరెక్టు కాదు" అని మరో పెద్దాయన స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, Viral, Viral Video