Viral Video : కోతి బావ దెబ్బకి తోకముడిచిన పెద్దపులి.. ముగింపు అద్భుతం..ఓ లుక్కేయండి..

Photo Credit : Twitter

Viral Video : జంతుప్రపంచంలో జరుగుతున్న వింతలు.. విశేషాలు అందరిని ఆకట్టుకుంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా.. దానిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రూరారణ్యంలో ఎవరిది, ఏ జంతువుది ఎప్పుడు పై చేయి అవుతుందో., ఏది ఏ జంతువును డామినేట్ చేస్తుందో చెప్పడం, ఊహించడం కష్టం..

  • Share this:
    జంతుప్రపంచంలో జరుగుతున్న వింతలు.. విశేషాలు అందరిని ఆకట్టుకుంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా.. దానిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రూరారణ్యంలో ఎవరిది, ఏ జంతువుది ఎప్పుడు పై చేయి అవుతుందో., ఏది ఏ జంతువును డామినేట్ చేస్తుందో చెప్పడం, ఊహించడం కష్టం.. రెండూ సమాన బలం గలవైనా ఒకటి మాత్రం తోక ముడవడం ఖాయం. అలాంటిది ఓ బలహీన జంతువుని వేటాడానికి క్రూర జంతువు పడరాని పాట్లు పడింది. చివరికి తోక ముడిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళితే..పులి వేట మొదలెడితే తప్పించుకోవడం ఏ జంతువు వల్ల కాదు. కానీ అడవిలో అల్లరి చేస్తూ.. పెద్ద, పెద్ద జంతువులకు మస్కా కొట్టే కోతి కూడా ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. ఈ క్రమంలో మీ ముందుకు ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చెట్టు ఎక్కి చిటారుకొమ్మన కూర్చున్న కోతిని వేటాడేందుకు.. పులి కూడా చెట్టు ఎక్కింది. ఈ క్రమంలో కోతి తన చేష్టలతో పులి దూకుడు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.వీడియోలో, మొదటి పులి వేటాడే ఉద్దేశ్యంతో చెట్టుపైన ఉన్న కోతి వద్దకు వెళుతుంది. కాని కోతి దగ్గరికి వచ్చేవరకు ఏమి ఎరగనట్టు నటించి.. దాన్ని కిందపడేలా చేసింది.

    ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్ఎస్ ప్రవీణ్ అంగూసామి షేర్ చేశారు." మీ బలహీనతలు పట్టుకుని వేలాడకండి, ఎల్లప్పుడూ మీ బలం ఏంటో తెలుసుకుని ఆట ఆడండి" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక, వీడియోలో కోతి స్కిల్ చూసిన ప్రతి ఒక్కరూ.. వారెవ్వా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీడియోను నిశితంగా గమనిస్తే.., ఒక చెట్టు కొమ్మపై ఊగిసలాడుతున్న కోతిని ఆహారంగా మలుచుకునేందుకు పులి కూడా చెట్టు ఎక్కడం మీరు చూడవచ్చు.


    సమీపానికి వచ్చి.. మీదకు దూకబోతున్న సమయంలో కోతి ఒక్కసారిగా పక్కకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో పులి చెట్టు నుంచి నేరుగా కింద పడిపోతుంది. కోతికి వచ్చిన విద్య ఏంటంటే.. ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి అలవోకగా దూకడం. తన ప్లేసుకు వచ్చి మరీ దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. వానరం ఎందుకు ఊరుకుంటుంది చెప్పండి..?. అందుకే తన మార్క్ కౌంటర్ ఇచ్చింది.
    Published by:Sridhar Reddy
    First published: