బెంగళూరులోని బన్నేర్‌ఘట్టా నేషనల్ పార్కులో జరిగిందీ ఘటన. ఓ బెంగాల్ టైగర్... సఫారీ వాహనాన్ని ఈడ్చుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది ఏకంగా 90 నిమిషాల వీడియో. కారు లాంటి సఫారీ వాహనంలో టూరిస్టులు పార్కులోకి వచ్చారు. 2 పులులు ఉన్న వైపు వెళ్లారు. అక్కడ వాహనాలను ఆపారు. ఇంతలో ఓ పెద్ద పులి... కారు దగ్గరకు వచ్చింది. ఏం చేసైనా సరే... కారును లాక్కుపోవాలనుకుందో ఏమో... ఒక్కసారిగా కారు బంపర్‌ను నోటితో పట్టుకుంది. అటూ ఇటూ లాగి... బంపర్‌ను పాడుచేసింది. పక్క కారులో ఉన్న వారు ఆ పులిని వీడియో తీశారు. అది ఎంతో పట్టుదలతో కారుపై దాడి చేయడాన్ని హై క్వాలిటీ కెమెరాతో షూట్ చేశారు.
నోటితో లాగితే బంపర్ రావట్లేదని గ్రహించిన పులి... తన పంజా దెబ్బ చూపించాలనుకుంది. ఇంతలో పక్క వాహనంలోని వారు వామ్మో ఎంత పని చేస్తోంది అని కంగారు పడ్డారు. అంతలో పులి... ఏకంగా కారును వెనక్కి లాగడం ప్రారంభించింది. నోటితో కారును పట్టి... వెనక్కి లాగుతుంటే అందులోని వారు "ఓర్నాయనో ఇదేం పులిరా బాబోయ్" అని కంగారు పడ్డారు. "ఇక లాభం లేదు... ఇలాగే ఊరుకుంటే... జింకను లాక్కెళ్లినట్లు కారును కూడా లాక్కుపోతుందేమో" అనుకుంటూ... అందరూ కేకలు వేయడం ప్రారంభించారు. దాంతో పులి నెమ్మదించింది.
Tiger pulling tourist vehicle in Bannerghatta park , Bengaluru
😣
Recieved on whatsapp pic.twitter.com/TfH8mAiN2b
— Mona Patel (@MonaPatelT) January 15, 2021
ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది. ట్విట్టర్ యూజర్ మోనాపటేల్ టి ఈ వీడియోని షేర్ చేశారు. "బెంగళూరులోని బన్నేర్‌ఘట్టా నేషనల్ పార్కులో టూరిస్టు వాహనాన్ని లాక్కెళ్లిన చిరుత" అని క్యాప్షన్ పెట్టారు.
ట్విట్టర్లో ఈ వీడియోని దాదాపు 9వేల మంది చూశారు. చాలా మంది రకరకాలుగా స్పందించారు. చాలా ఆసక్తిగా ఉంది అని ఒకరు కామెంట్ రాయగా... "మొన్న చిరుతపులి... ఇప్పుడు పెద్ద పులి... ఏం జరుగుతోంది" అని మరో యూజర్ రాశారు. ఇది చాలా బలంగా ఉంది అని మరొకరు... 100 హార్స్ పవర్... 1 టైగర్ పవర్‌కి సమానం అని మరొకరు రాశారు.
ఇదే విధంగా హిమాచల్ ప్రదేశ్... కుల్లులో ఓ చిరుతపులి ఆకలితో... అటుగా వచ్చిన ప్రయాణికుల్ని ఆహారం కోసం బతిమలాడిన 2 వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ చిరుతపులి ఎవర్నీ గాయపరచకుండా ఆహారం కోసం ప్రాథేయపడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Kullu, Himachal Pradesh: Wild Leopard Cub Plays With Local#Incredible #HimachalPradesh
Hills Are Vulnerable, Say No To Plastic 🌍
Explore #Himachal With #Jannatofhimachal pic.twitter.com/YA2TbfSBxY
— Jannat of Himachal (@janatofhimachal) January 14, 2021
ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఇలాంటి వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. వైల్డ్‌లైఫ్‌ని ఇష్టపడుతున్న నెటిజన్లు వీటిని బాగా లైక్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger Attack, VIRAL NEWS, Viral Videos