Viral Video: ఏనుగును భయపెట్టాలని చూసిన పులి.. కానీ చివరకు ఏమైందంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

Elephant vs Tiger: ఏనుగును చూసి పులి భయపడటం ఇది కొత్తేమీ కాదు.. గతంలోనూ ఇలాంటి సీన్లు కనిపించాయి.

 • Share this:
  క్రూర మృగమైన పులి అంటే అందరికీ భయమే. ఎంతటి జంతువునైన మట్టి కరిపించే సత్తా ఉన్న పులికి అనేక జంతువులు భయపడతాయి. పులి గాండ్రిపు వింటేనే హడలిపోతాయి. పులి ఉన్న చోటు దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి సాహసించవు. అయితే పులి కూడా కొన్ని జంతువులకు భయపడుతుంది. మరీ ముఖ్యంగా ఏనుగు లాంటి పెద్ద జంతువు జోలికి వెళ్లేందుకు పులులు ఎక్కువగా సాహసించవు. అందులోనూ పులి ఒంటరిగా ఉన్న సమయంలో ఏనుగు వస్తే అక్కడి నుంచి అది సైలెంట్‌గా జారుకుంటుంది. తాజాగా ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  బాలీవుడ్ నటి దియా మీర్జా.. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కూల్‌గా కూర్చున్న పులి.. తన వెనుక నుంచి నడుచుకుంటూ వస్తున్న ఏనుగును చూస్తుంది. దాని వైపు చూసి గాండ్రిస్తుంది. అయితే ఏనుగు ఏ మాత్రం దాన్ని పట్టించుకోకుండా ముందుకు రావడంతో అక్కడి నుంచి పక్కనే ఉన్న పొదల్లోకి పరుగులు తీస్తుంది పులి. ఈ వీడియో ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటోంది. ఎంతైనా పులి పులే అనే వాళ్లు కూడా.. ఏనుగు ముందు పులి కూడా పిల్లిలా మారిపోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.  అయితే ఏనుగును చూసి పులి భయపడటం ఇది కొత్తేమీ కాదు.. గతంలోనూ ఇలాంటి సీన్లు కనిపించాయి. ఏనుగును చూసి పులి పొదల్లో దాక్కున్న ఓ వీడియో కూడా గతంలో బాగా వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి ఏనుగును చూసి పులి భయపడటం చాలామందిని ఆకట్టుకుంటోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: