హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: తల్లిని హత్తుకున్న పులిపిల్ల.. ఆనందం కలిగించే వీడియో

Viral Video: తల్లిని హత్తుకున్న పులిపిల్ల.. ఆనందం కలిగించే వీడియో

Twitter image

Twitter image

సేదతీరుతున్న ఓ పులి (Tiger )ని  దాని పిల్ల ఆప్యాయంగా హత్తుకుంది. ఎంతో ముద్దుగా ఆడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ప్రపంచంలో ఏ జీవికైనా తల్లితో అనుబంధం ఎంతో అపురూపమైనది. అమ్మ వద్ద ఉంటే ప్రపంచాన్ని మరిచి సంతోషంగా ఉండొచ్చు. తాజాగా ఓ పులిపిల్ల తన తల్లితో ఆడుకున్న వీడియో సోషల్ మీడియాలై వైరల్ అయింది. చిన్నపులి పిల్ల నిద్రిస్తున్న తల్లిని హత్తుకొని ఆడుకుంది. ఆ పెద్ద పులి కూడా తన కొడుకును ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఆ పిల్ల ఆనందంతో తల్లి చుట్టే తిరిగింది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత నంద్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. “తల్లి హత్తుకోవడమే ఆనందం” అని క్యాప్షన్ పెట్టారు. చూసేందుకు ఆహ్లాదరకంగా, అద్భుతంగా ఉన్న ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేలాది లైక్​లు, వ్యూస్ వస్తున్నాయి.

“అమ్మ హగ్​తో దేన్నీ పోల్చలేము. స్వర్గం అంతే” అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. “తల్లి ప్రేమ ఎప్పుడూ ఆనంతమే” మరికొందరు స్పందించారు.

అలాగే సో క్యూట్​, బ్యూటిఫుల్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

“ఆ పులి.. తన బిడ్డకు గొంతును ఎలా టార్గెట్ చేయాలో నేర్పిస్తోంది. ఈ క్రమంతో తాను నొప్పిని కూడా భరిస్తోంది” అని ఓ యూజర్ విభిన్నంగా కామెంట్ చేశారు. “దీన్ని చాలా రకాలుగా ఆలోచించవచ్చు. కానీ ప్రేమ, ఆప్యాయత వెలకట్టలేనివి” అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

ఇలా ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది.

First published:

Tags: Tiger, Viral Video

ఉత్తమ కథలు