కొన్ని జంతువులు అడవిలో ఉన్న, బోనులో ఉన్న వేటాడం మాత్రం మరిచిపోవు. అవకాశం దొరకాలే కానీ బోనులో కూడా వేటకు సిద్దపడతాయి. దొరికిన దేనినైనా విడిచిపెట్టవు. తాజాగా పులి ఎదురుగా మనిషి నిలబడి ఉంటే.. ఎలా రియాక్ట్ అవుతుందో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పులి.. చిన్నారిపై దాడి చేయడానికి వస్తుంది. కానీ చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియోను The Sun ట్విట్టర్లో షేర్ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ చిన్నారి నిల్చుని నవ్వుతూ ఉన్నాడు. అతని ముందు నిల్చుని వారు బహూశా అతనికి ఏదో చెబుతున్నట్టు ఉన్నారు. అయితే బాలుడి వెనకాల కొద్ది దూరంలో ఉన్న పులి.. అతడిని చూసిన వెంటనే వేగంగా అతనివైపు కదిలింది. అతనిని తినేద్దాం అనే ఆవేశంలో పరుగు తీసింది.
అదే సమయంలో బాలుడు వెనకు తిరిగాడు. పులిని చూసి సంతోషపడ్డాడు. ఇక, బాలుడిని తినేద్దామని వచ్చిన పులి.. అతని వెనకాల అగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే బాలుడి వెనకాల ఉన్న గ్లాస్ ఉంది. దీంతో పులి గ్లాస్‌ను తొలగించే ప్రయత్నం చేసింది. అయితే అది చాలా గట్టిగా ఉండటంతో పులి ప్రయత్నం ఫలించలేదు. ఇక, పులి గ్లాస్‌పై పంజా విసురుతున్న సమయంలో బాలుడు భయంతో అక్కడి నుంచి ముందుకు కదిలాడు.
Kid gets fright of his life as tiger tries to pounce through glass at zoo pic.twitter.com/sONqwjtLxJ
— The Sun (@TheSun) May 30, 2021
ఇక, ఈ వీడియో ఒక పార్క్‌లో తీసింది. పార్క్‌కు వచ్చిన సందర్శకులు అక్కడ ఏర్పాటు చేసి గ్లాస్ గోడ ద్వారా జంతువులను వీక్షిస్తారు. ఈ చిన్నారి కూడా జంతువులను చూస్తూ మురిసిపోయాడు. ఆ సమయంలో పులి దగ్గరగా వస్తే.. బాలుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలని అతడి తల్లిదండ్రులే ఈ వీడియోను రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger, Viral Video