Tiger Attack Video: ఎప్పుడైనా సరే అపాయం అనేది చెప్పి రాదు. ఎప్పుడు ఏమవుతుందోమనం ఊహిచలేం. నెక్ట్స్ మినిట్ ఏం జరుగుతుందో చెప్పలేం. అలాంటి ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. మనందరికీ జూల్లో సింహాలు, పులులను చూడటం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అవి మనల్ని తినేస్తాయనే భయం మనల్ని వాటివైపు చూసేలా చేస్తుంది. అవి బంధించి ఉంటాయి కాబట్టి మనం ధైర్యంగా వాటి దగ్గరకు వెళ్తాం. అదే ఓపెన్‌గా ఉంటే… పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటి డేంజరస్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. IFS ఆఫీసర్ సుశాంత నంద ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో రెండు కార్ల నిండా టూరిస్టులు వచ్చారు. అక్కడ గోడ అవతల వారికి ఓ పులి కనిపించింది. దాన్ని చూసేందుకు అందరూ కార్లలోంచీ పైకి లేచారు. దాన్ని ఫొటోలు, వీడియోలూ తీస్తూ… “ఎలా ఉందో చూడు… ఎలా చూస్తుందో చూడు... వామ్మో” అని చెప్పుకుంటుంటే… సడెన్‌గా ఆ పులి… వారి వైపు రావడం మొదలుపెట్టింది. అయినా వాళ్లు దర్జాగా ఉన్నారు. ఎందుకంటే… పులికి చెట్లు ఎక్కడం రాదు కాబట్టి… అది గోడ కూడా ఎక్కలేదు అనుకున్నారు. కానీ ఆ పులి ఒక్క దూకు దూకి… గోడ పైకి ఎక్కేసింది. అంతే టూరిస్టులకు గుండెల్లో ఏవేవో పరిగెత్తాయి. ఆ పులి వాళ్లవైపు కోపంగా చూస్తూ… పులులను తక్కువగా అంచనా వేయొద్దు అనే మేసేజ్ ఇచ్చినట్లుగా పోజ్ ఇచ్చి… వాళ్లను ఏమీ చెయ్యకుండానే వెళ్లిపోయింది.
Idiotitis...
When human brain shuts down & mouth keeps talking.
Appreciate the anger management of the tiger. But that can’t be guaranteed in future. pic.twitter.com/dSG3z37fa8
— Susanta Nanda IFS (@susantananda3) January 21, 2021
నిజానికి ఆ పులి దాడి చేసేదే. ఐతే… అప్పటివరకూ అరిచిన టూరిస్టులు పులి తమ దగ్గరకు రాగానే సైలెంట్ అయిపోయారు. దాంతో పులి కూడా మనుషులతో నాకెందుకు… అన్నట్లుగా వెళ్లిపోయింది. ఈ వీడియోలో టూరిస్టులను సుశాంత నందా తప్పు పట్టారు. వన్యప్రాణులతో ఆటలాడితే ఇలాగే ఉంటుందనీ, ఇష్టమొచ్చినట్లు అరిస్తే… వన్యప్రాణులకు కోపం వస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి:Bengal tiger: సఫారీ వాహనాన్ని ఈడ్చుకుపోయిన పెద్ద పులి... వైరల్ వీడియో
నెటిజన్లు కూడా టూరిస్టులనే తప్పు పట్టారు. పోయి పోయి పులితే పెట్టుకుంటారా… అందుకే ఇలా అయ్యింది. ఇప్పుడు తెలిసిందిగా అని ఫైర్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger Attack, VIRAL NEWS, Viral Videos