మీరు ఎప్పుడైనా పులులు కొట్టుకోవడాన్ని దగ్గరుండి చూశారా? బహుశా చూడకపోయి ఉండొచ్చు. చూసి ఉంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే అరుదైన సందర్భాల్లో మాత్రమే పులులు కొట్టుకుంటాయి. ఆ పోరాటాన్ని కళ్లారా చూస్తే మాత్రం మనకు ఒళ్లు జలదరిస్తుంది. వాటి గర్జనలు, పంజా దెబ్బలు, ఉరికే జోరు... అన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. "ఎలా కొట్టుకుంటున్నాయో చూడు... వామ్మో" అనుకుంటాం. అలాంటి ఓ దృశ్యం... రణతంబోర్ జాతీయ అభయారణ్యంలో కనిపించింది. ఈ అడవి పులులకు ప్రసిద్ధి. ఇక్కడి ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పులుల ఫైట్ వారికి షాక్ తెప్పిస్తోంది.
పక్క పులి ఆహారం లాక్కోవడానికి మరో పులి ఎప్పుడూ ప్రయత్నించదు. దేని కదే ఆహారాన్ని సంపాదించుకుంటాయి. వేటాడతాయి. ఐతే… మన దగ్గర స్థలాలు ఆక్రమించుకుంటే… ఎలా గొడవలు జరుగుతాయో… అడవిలో కూడా పులుల మధ్య స్థలాల గొడవలు ఉంటాయి. అంటే… ప్రతీ పులీ… తనకంటూ కొంత పరిధిని పెట్టుకుంటుంది. అది ఎప్పుడూ ఆ ఏరియాలోనే తిరుగుతూ… అక్కడే వేటాడుకుంటూ అలా బతుకుతుంది. తన ఏరియాలోకి మరో పులి రాకూండా హెచ్చరిక కోసం… సరిహద్దుల దగ్గర ఉన్న చెట్ల బెరళ్లను పులులు చీల్చుతాయి. ఆ బెరళ్లపై పులుల పంజా గీతలు ఉంటాయి. వాటిని చూసి మరో పులి ఆ ఏరియాలోకి రాదు. పొరపాటున వచ్చిందంటే మాత్రం వీడియోలోలాగా గొడవ జరిగిపోతుంది.
ఈ వీడియోలో ఓ పులి పేరు రిద్ధి. మరో పులి దాని చెల్లెలు. వాటి మధ్యే గొడవ జరిగింది. ఈ గొడవలో ఇష్టమొచ్చినట్లు కొట్టేసుకోవడమే కాదు… రిద్దీ నాలికను రిద్దీ చెల్లి కొరికేసింది. దాంతో రిద్దీ ఓడిపోయింది. ఈ గొడవ తర్వాత రిద్దీని ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారట. అంతలా అవి కొట్టేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Pearl Astrology: ముత్యాలు, వెండి నగలు ధరిస్తున్నారా... ఈ 8 నష్టాలు తప్పవు
మొత్తానికి ఈ అరుదైన వీడియో అందరికీ ఎక్సైట్మెంట్ కలిగిస్తోంది. అవి దెబ్బలాడుకోవడం ఎవరికీ ఇష్టం లేకపోయినా… జరిగిందేదో జరిగిపోయిందని వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:January 27, 2021, 12:45 IST