హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Tiger attack video : పులి ఎన్‌క్లోజర్‌లో చెయ్యి పెట్టాడు.. ఏమైందో తెలుసా?

Tiger attack video : పులి ఎన్‌క్లోజర్‌లో చెయ్యి పెట్టాడు.. ఏమైందో తెలుసా?

పులి ఎన్‌క్లోజర్‌లో చెయ్యి పెట్టాడు.. ఏమైందో తెలుసా? (image credit - instagram - earth.reel
)

పులి ఎన్‌క్లోజర్‌లో చెయ్యి పెట్టాడు.. ఏమైందో తెలుసా? (image credit - instagram - earth.reel )

Tiger attack video : కొంతమందికి కుదురు ఉండదు. ఏదో ఒక ఆకతాయి పని చేస్తారు. తెలిసే చేస్తారు. ఫలితంగా కర్మను అనుభవిస్తారు. జూకి వెళ్లిన ఓ ఫ్యామిలీకి ఎదురైన పరిస్థితిని తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Tiger attack video : మన దేశంలోని చాలా జూలలో.. వన్యమృగాలను సందర్శకులకు దూరంగా పెడుతున్నారు. ఎందుకంటే జూకి వెళ్లేవారిలో అందరూ రూల్స్ పాటించరు. కొంతమంది తాము మిగతావారి కంటే భిన్నం అని భావిస్తారు. తమను చూస్తే.. క్రూరమృగాలు సైతం సైలెంటైపోతాయనీ.. తమను ఏమీ చెయ్యవు అని నమ్ముతారు. అలాంటి వాళ్లు చేసే పనుల వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ (viral video) అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌లోని earth.reel పేజీలో ఈ వీడియోని 8-1-2023న పోస్ట్ చేశారు. దీన్ని గమనిస్తే.. ఓ ఫ్యామిలీ జూకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అక్కడి ఎన్‌క్లోజర్లలో పులులు, సింహాలూ ఉన్నాయి. ఓ ఎన్‌క్లోజర్‌లో ఉన్న పులి దగ్గరకు వెళ్లారు ఆ దంపతులు. వారిలో ఓ వ్యక్తి.. పులిని పిలిచాడు. ఆ పులి.. అమాయకత్వం ప్రదర్శిస్తూ అతని దగ్గరకు వచ్చి.. అతని బ్యాగును పట్టుకునేందుకు ప్రయత్నించింది.

ఆ సమయంలో అతను.. ఎన్‌క్లోజర్ ఫెన్స్ నుంచి చేతిని లోపలికి పోనిచ్చాడు. పులిని మెడ దగ్గర నిమిరేందుకు ప్రయత్నించాడు. అప్పటివరకూ అమాయకంగా నటించిన పులి.. ఒక్కసారిగా దాడి చేసి.. చేతిని కొరికేసింది. దాంతో ఆ ఫ్యామిలీ ఉలిక్కిపడింది. బోలెడంత రక్తం పోయింది. చివరకు ఎలాగొలా చేతిని వెనక్కి తీసుకున్నాడు. కానీ అప్పటికే పులి చాలా వరకూ చేతిని కొరికేసింది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viewer discretion is advised)

View this post on Instagram

A post shared by Earth Reels (@earth.reel)

ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "నా అభిప్రాయం ప్రకారం ఆ పులి కరెక్టుగానే చేసింది. అతను అలా చెయ్యకూడదు. ప్రభుత్వం కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.

"ఈ భూమిపై కొంతమందికి అతి తెలివి ఎక్కువ" అని మరో యూజర్ కామెంట్ ఇవ్వగా... "ఆ పులి ప్రేమకు అతను అర్హుడు" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "కొంతమంది మూర్ఖులు ఇలా చేస్తారు" అని మరో యూజర్ కామెంట్ రాశారు. మొత్తంగా ఇలా చెయ్యవద్దు అని చాలా మంది సూచిస్తున్నారు.

First published:

Tags: Tiger Attack, Trending video, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు