• HOME
 • »
 • NEWS
 • »
 • TRENDING
 • »
 • THRILLING VIDEO IN THE FOREST THE LEOPARD KILLED AND DRAGGED THE LEOPARD THE VIDEO WENT VIRAL WATCH VIDEO NK

Thrilling VIDEO in the Village: కుక్కను ఈడ్చుకెళ్లిన చిరుతపులి.. థ్రిల్లింగ్ వైరల్ వీడియో

Thrilling VIDEO in the Village: కుక్కను ఈడ్చుకెళ్లిన చిరుతపులి.. థ్రిల్లింగ్ వైరల్ వీడియో

కుక్కను ఈడ్చుకెళ్లిన చిరుతపులి.. థ్రిల్లింగ్ వైరల్ వీడియో (image grabbed from twitter video - sachin salve)

Thrilling VIDEO in the Village: ఇలాంటి ఘటనలు ఎప్పుడు బడితే అప్పుడు జరగవు. అవి జరిగినప్పుడే మనం చూడాలి. ఆ చిరుతపులి కుక్కను ఈడ్చుకుపోయిన వీడియోని చూసి వామ్మో అంటున్నారు ప్రజలు.

 • Share this:
  చిరుతపులులు... కరెంటు తీగలా సన్నగా ఉంటాయి... కానీ వాటితో పెట్టుకుంటే... ప్రాణాలు పైకే. అందుకు ఎన్నో ఉదాహరణలను మనం చూశాం. తాజాగా అలాంటి ఓ వీడియోని ఇప్పుడు నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తూ... ఆశ్చర్యపోతున్నారు... "కుక్కను ఎలా పట్టుకుపోతుందో చూడు"... వామ్మో అంటూ ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన జరిగింది మహారాష్ట్ర... నాసిక్ జిల్లాలోని... అహ్మద్‌నగర్‌లో ఉన్న ఇకత్‌పురి గ్రామంలో జరిగింది. అక్కడ ఓ ఇంటి దగ్గర... గుబురుగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పక్కన పొలాలు... ఆ చివరలో అడవి లాంటిది ఉంటుంది. అక్కడ ఓ దుంగకు పెంపుడు కుక్కను తాడుతో కట్టారు దాని యజమానులు. ఇంతలో అటు వైపు ఉన్న పొదల్లోంచీ... క్రూరంగా చూస్తూ... చిరుతపులి ఎంటరైంది. దాన్ని చూడగానే... కుక్కకు వాసన వచ్చింది. గుండె ఆగినంత పనైంది. తప్పించుకుందామంటే... తాడు కట్టేసి ఉంది. కుక్క పారిపోయేందుకు గిలగిలా విలవిల లాడుతుంటే... "ఎక్కడికి పోతావే... అయిపోయావ్ నా చేతిలో" అనుకుంటూ చిరుతపులి... ఒక్కసారిగా ఉరికి... పంజా దెబ్బలు విసిరింది. అంతే... కుక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదంతా అక్కడి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

  కుక్కను చంపాక... ఇక దాన్ని లాక్కుపోదామని అనుకుంది చిరుతపులి. ఐతే... కుక్క అంత ఈజీగా రాలేదు. దాన్ని ఓ దుంగకు తాడుతో కట్టివేయడం వల్ల... కుక్కను లాగుతుంటే... దుంగ కూడా కదిలి రావడాన్ని చిరుత చూసింది. "ఏంటిది... ఎవరైనా నన్ను బంధించడానికి ఈ దుంగ ప్లాన్ వేశారా" అనుకుంటూ ఓ క్షణం ఆగి చుట్టూ చూసింది. కమెరా వైపు తీక్షణంగా చూసింది. ఆ తర్వాత... "ఏం లేదులే" అనుకుంటూ.. ఆ తాడును నోటితో కొరికేసింది. ఆ తర్వాత తాపీగా చనిపోయిన కుక్కను ఈడ్చుకుంటూ... తుప్పల్లోకి వెళ్లిపోయింది. ఈ థ్రిల్లింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ వైరల్ అవుతోంది.


  మీడియా రిపోర్టుల ప్రకారం... ఆ కుక్క యజమాని బాబా జోల్. ఆయన ఇంటి దగ్గరే ఇది జరిగింది. చిరుత పులి వచ్చినప్పుడు ఆ కుక్క గొంతు చించుకొని మరీ అరిచింది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దాంతో ఆ కుక్కను ఎవరూ కాపాడలేదు. తాడు కారణంగా అది తప్పించుకోలేక... తన చావును తాను కళ్లారా చూసుకున్నట్లైంది.

  ఇది కూడా చదవండి:Gold Silver Prices Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవీ

  ఈ గ్రామంలో చిరుతపులులు తరచూ వస్తున్నాయి. స్థానికులకు సరిగా నిద్ర పట్టట్లేదు. ప్రజలు సింగిల్‌గా తిరగడం మానేసి గుంపులుగా తిరుగుతున్నారు. ఇలాంటి ఘటనలపై అధికారులకు చెబితే... వాళ్లు వచ్చి వెతుకుతున్నా... చిరుతలు కనిపించట్లేదు. నాసిక్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అటవీ అధికారులు, పోలీసులూ కలిసి జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదివరకటితో పోల్చితే... ఇప్పుడు చిరుతల సంచారం తగ్గిందని అంటున్నారు. కానీ... తగ్గలేదు అని నిరూపిస్తూ... ఈ కుక్క వీడియో కలకలం రేపుతోంది.
  Published by:Krishna Kumar N
  First published: