ఒకే రోజు.. ఒకే వేదికపై మూడు పెళ్లిళ్లు.. అందులో విశేషమేమిటంటే..?

కేరళలో ఇటీవల జరిగిన వివాహం ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: October 26, 2020, 10:02 AM IST
ఒకే రోజు.. ఒకే వేదికపై మూడు పెళ్లిళ్లు.. అందులో విశేషమేమిటంటే..?
తల్లి రమాదేవితో పిల్లలు
  • Share this:
కేరళలో ఇటీవల జరిగిన వివాహం ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళకు జన్మించిన ఐదుగురు కవలలలో.. ముగ్గరు అమ్మాయిల వివాహం ఒకే రోజు.. ఒకే వేదికపై జరిగింది. వివరాలు.. తిరువనంతపురంకు చెందిన ప్రేమ్‌కుమార్, రమాదేవి దంపతులకు 1995 నవంబర్ 18 ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించారు. వారిలో నలుగురు ఆడపిల్లలు కాగా, ఒక మగ పిలగాడు ఉన్నాడు. వారి జన్మ నక్షత్రం ఉత్తమ్ కావడంతో.. ఐదుగురు పిల్లకు "ఉ" అక్షరంతో ప్రారంభమయ్యేలా.. ఉత్తర, ఉత్తమ, ఉత్రా, ఉత్రజా, ఉత్రాజన్ అనే పేర్లు పెట్టారు. ఒకే కాన్పులో జన్మించిన వీరి గురించి పలు సందర్భాల్లో పత్రిక కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక, నలుగురు అమ్మాయిలు ఉత్తర, ఉత్రా, ఉత్తమ, ఉత్రజలకు వారి వారి కాబోయే జీవిత భాగస్వాములతో ఒక్క రోజే నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 26న నలుగురి పెళ్లి జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా వల్ల ఆ పెళ్లిలు కాస్తా వాయిదా పడ్డాయి.

ఇక, రోజులు గడిచిపోయాయి. దీంతో అక్టోబర్ 24న వీరి పెళ్లిలు జరపాలని నిర్ణయించారు. అయితే అందులో ఉత్రజను పెళ్లి చేసుకోనే వ్యక్తి కువైటులో చిక్కుకుపోవడంతో ఇండియాకు సమాయానికి రాలేకపోయాడు. దీంతో వారి పెళ్లికి మరో ముహుర్తాన్ని నిర్ణయించారు. ఇక, అక్టోబర్ 24న గురువాయర్ శ్రీకృష్ణ ఆలయంలో ముగ్గరు కవలలు పెళ్లిలు జరిగాయి. ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్న ఉత్ర.. విదేశాల్లో హోటల్ మెనేజ్‌మెంట్ వృత్తిలో ఉన్న అజిత్‌కుమార్‌ను, ఆన్‌లైన జర్నలిస్ట్‌గా ఉన్న ఉత్తర.. జర్నలిస్టుగా ఉన్న కేబీ మహేష్‌కుమార్‌ను, అనస్థీషియా టెక్నీషియన్‌గా ఉన్న ఉత్తమ.. ఎన్‌ఆర్‌ఐ అకౌంటెంట్ వినీత్‌ను పెళ్లి చేసుకున్నారు.

ఇక, ఐదుగురు పిల్లల్ని వాళ్లకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్లాడు. దీంతో పిల్లలను తల్లి రమాదేవి పెంచి పోషించింది. ఆ తర్వాత పలువురు వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. కొద్దిరోజులకు రమాదేవికి బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక, ఇప్పుడు తన ముగ్గరు పిల్లలకు పెళ్లి జరగడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading