హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Short Couple: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మూడు అడుగుల ఎత్తున్న జంట ..వీడియో ఇదిగో..

Short Couple: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మూడు అడుగుల ఎత్తున్న జంట ..వీడియో ఇదిగో..

Short Couple

Short Couple

Short Couple: మూడున్నర అడుగుల ఎత్తున్న రేణు అనే వధువును మూడు అడుగుల ఎత్తున్న శ్యామ్ మెడలో పూలమాల వేసి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. ఈ అరుదైన జంట పెళ్లి వేడుకను బంధువులు, కుటుంబ సభ్యులే కాదు..చుట్టు పక్కల వారు కూడా ఈ పొట్టి జంట పెళ్లి వేడుకల్ని తమ సెల్‌ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

బీహార్‌(Bihar)లో ఓ అపూర్వ జంట వివాహం బంధంతో ఒక్కటైంది. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ప్రత్యేకత ఏముంటుందని కొట్టిపారేయకండి. ఇక్కడ పెళ్లి చేసుకున్న నూతన వరుడు, వధువు ఎత్తే ఇక్కడ ప్రత్యేక వార్తగా నిలించింది. మధుర(Mathura)లోని చాప్రాలోని గాడ్‌దేవి ఆలయంలో పెళ్లి చేసుకున్న జంట ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే మాటకు ఈ సంఘటన చక్కని నిదర్శనంగా నిలిచింది. మూడున్నర అడుగుల(3.5Feet) ఎత్తున్న రేణు(Renu) అనే వధువును మూడు అడుగుల ఎత్తున్న శ్యామ్(Shyam) మెడలో పూలమాల వేసి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. ఈ అరుదైన జంట పెళ్లి వేడుకను బంధువులు, కుటుంబ సభ్యులే కాదు..చుట్టు పక్కల వారు కూడా ఈ పొట్టి జంట పెళ్లి వేడుకల్ని తమ సెల్‌ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుతోంది.

పొట్టి జంట పెళ్లి వీడియో వైరల్..

అతి కురచగా ఉన్న ఈ జంట పెళ్లి ఇప్పుడు బీహార్‌లోనే కాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చగా మారింది. మధుర జిల్లా ఛప్రా రాంకోల్వా, చప్రా చంచౌరాలో నివాసముంటున్న భూతేలి సాహ్ కుమారుడు 23 ఏళ్ల శ్యామ్ కుమార్ ఏడుగురు సంతానంలో ఒకడు. అందరికంటే పొట్టిగా అంటే మూడు అడుగులు మాత్రమే ఉండటంతో శ్యామ్‌కు వివాహం కాలేదు. భావల్‌పూర్‌లోని మధురా నివాసి గుడేలి మహ్తో చిన్న కుమార్తె 20 ఏళ్ల రేణు కూడా మూడున్నర అఢుగుల ఎత్తు ఉంది. ఈమెకు నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. వీళ్లందరిలో రేణు పొట్టిగా ఉండటంతో పెళ్లి ఎలా అవుతుందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యేవారు.

మూడు అడుగల ఎత్తున్న జంట..

ఈవిధంగా పొట్టి కారణంగా రేణు, శ్యామ్‌కు వివాహం ఆలస్యమైంది. ఈక్రమంలోనే వీరి పెళ్లికి ముందే ఓ సినిమా స్టైల్‌లో ఓ స్టోరీ నడిచింది. భావల్‌పూర్‌కు చెందిన శైలేష్ సింగ్ అత్తమామలు చంచౌరా ఇంటికి వెళ్లినప్పుడు, ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే శ్యామ్‌తో పరిచయం ఏర్పడింది. శైలేష్ సింగ్ భార్య సోదరుడు బబ్లూ సింగ్ సలహా మేరకు శైలేష్ సింగ్ తన గ్రామంలోని రేణు కుటుంబంతో మాట్లాడాడు. జోడీలు ముందే డిసైడ్ అయ్యాయని అంటున్నారు. శైలేష్ సింగ్ మరియు బబ్లూ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారం రోజుల క్రితం శ్యామ్‌, రేణు మర్హౌరాలోని గాధదేవి ఆలయంలో కలుసుకొని ఒకరినొకరు ఇష్టపడ్డారు.

Amazing News: నీటి కొరతకు 400ఏళ్ల క్రితమే పరిష్కారం కనిపెట్టిన ఆలయం ..ఎక్కడుందో తెలుసా..

ఆ విధంగా ముడిపడిన బంధం ..

అదే విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు కూడా ఈ పొట్టి జోడికి పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారు.శుక్రవారం గద్దెదేవి ఆలయంలోని మాత ఎదుట వారిద్దరూ ఒకరికొకరు జీవిత భాగస్వాములు అయ్యారు. ఈ అపూర్వ వివాహాన్ని వందలాది మంది తిలకించారు. వీరిద్దరిని వధూవరులుగా చూసిన వారందరూ ఈ అద్భుతంలో ఆశీర్వదించడమే కాకుండా తమ సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. మనసులో పొట్టిగా పుట్టామనే బాధతో ఉన్న ఇద్దరూ దాంపత్య బంధంతో ఒక్కటవడంతో వారిద్దరిలో ఆనందం వెల్లువిరిసింది.

మధ్యవర్తల ప్రమేయంతో..

ఈవిషయంలో శ్యామ్‌ తాను పొట్టిగా ఉంటానని ..తనకు సరిపోయే అమ్మాయి దొరకదని ఫీలయ్యేవాడని ఫ్రెండ్స్ చెబుతున్నారు. అసలు పెళ్లే చేసుకోకూడదని భావించిన శ్యామ్‌కు సరైన లైఫ్ పార్టనర్ దొరికిందన్నాడు. పెళ్లికూతురు రేణు కూడా తన జీవిత భాగస్వామిని కలుస్తానో లేదో అనే సందేహం ఉండేదని ..ఇప్పుడు ఆ కల నెరవేరిందని అంటోంది. ఈ పెళ్లిలో ఇరు కుటుంబాలు పాల్గొనడం తమ అదృష్టమని ఇరువురు తెలిపారు. అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమైన శైలేష్ సింగ్, బబ్లూ సింగ్‌కు వధువరుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

First published:

Tags: Bihar News, VIRAL NEWS, Viral Video, Wedding

ఉత్తమ కథలు