వ్యభిచార కూపంలో వేలాది మంది.. డ్రాగన్ దేశంలో సెక్స్ రాకెట్ బుసలు

China Sex Racket: ఒక్కో మహిళను రూ.10వేలకు కొని, వ్యభిచారం చేయిస్తున్నారు. వారి ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టి రూ.300లకు ఒక్కో అమ్మాయితో పాడు పని చేయిస్తున్నట్లు తెలిసింది. ఈ సెక్స్ రాకెట్ దందాతో రూ.700 కోట్లు చేతులు మారుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

news18-telugu
Updated: June 10, 2019, 6:45 PM IST
వ్యభిచార కూపంలో వేలాది మంది.. డ్రాగన్ దేశంలో సెక్స్ రాకెట్ బుసలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 10, 2019, 6:45 PM IST
సెక్స్ రాకెట్ దందా నిర్వహించేందుకు అమాయక యువతులను వేలాది కిలోమీటర్లు దాటిస్తున్నారు.. దేశం కాని దేశానికి తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారు.. నరక కూపంలోకి నెట్టి ఎంతో మంది అమాయక యువతులు, మహిళలు, బాలికలను బలి చేస్తున్నారు.. విచ్చలవిడిగా చెలరేగుతున్న ఈ దందా ఎన్నో కుటుంబాల్లో విషాద చాయలు నింపుతోంది. లండన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ కొరియా ఫ్యూచర్ ఇనిషియేటివ్ (కేఎఫ్ఐ) నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాకు చెందిన యువతులను అపహరించి, చైనీయులతో బలవంతపు పెళ్లిళ్లు జరిపించి సెక్స్ బానిసలుగా మార్చుతున్నారు. ఒక్కో మహిళను రూ.10వేలకు కొని, వ్యభిచారం చేయిస్తున్నారు. వారి ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టి రూ.300లకు ఒక్కో అమ్మాయితో పాడు పని చేయిస్తున్నట్లు తెలిసింది. ఈ సెక్స్ రాకెట్ దందాతో రూ.700 కోట్లు చేతులు మారుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

వలస కార్మికుల జనాభా ఎక్కువగా ఉండే ఈశాన్య చైనా జిల్లాల్లోని వ్యభిచార గృహాల్లోనే చాలా మంది చిక్కుకుపోతున్నట్లు కేఎఫ్‌ఐ నివేదిక పేర్కొంది. ఇక, వాళ్లతో సెక్స్ చేసిన సంఘటనలను వీడియో తీస్తారట. ఆ వీడియోలను ఎక్కువగా దక్షిణ కొరియా వాసులే చూస్తున్నట్లు నివేదిక తెలిపింది.

అటు, పాకిస్తాన్‌కు చెందిన మహిళలను కూడా దొంగ పెళ్లి చేసుకొని వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వారిని సెక్స్ బానిసలుగా మార్చి కోట్ల దందా చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కొంత మంది చర్చి పాస్టర్లు మైనారిటీ వర్గానికి చెందిన క్రైస్తవ అమ్మాయిలకు వలవేసి ఈ దందాను జోరుగా నడిపిస్తున్నారు.

ఈ నరక కూపం నుంచి అమాయకులకు బయటికి లాగేందుకు దక్షిణ కొరియాకు చెందిన పాస్టర్, ఆయన స్వచ్ఛంద సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది.

First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...