హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Videos : ఈ మహిళ వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

Viral Videos : ఈ మహిళ వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

(image credit - youtube)

(image credit - youtube)

Viral Videos: ఆ వీడియోల్లో మహిళ సరికొత్త వంటలు చేస్తోంది. అలా చేస్తున్నప్పుడు అందరి దృష్టీ ఆమె అందాలపైకే వెళ్తోంది. ఎందుకంటే... అదే ఆ వీడియోల ప్రత్యేకత.

యూట్యూబ్‌(YouTube)లో ఒకసారి క్లిక్ అయితే వచ్చే క్రేజే వేరు. సెలబ్రిటీల స్థాయి గుర్తింపు వస్తోంది. ఇక, యూట్యూబ్ లో వంటల ఛానెళ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి వంట ఎలా చెయ్యాలో చెప్పేందుకు వందల కొద్దీ వీడియోలు ఉన్నాయి. అది చికెన్ అయినా, వెజ్ కర్రీ అయినా... ఏది కావాలన్నా... దాని పేరుతో సెర్చ్ కొడితే... వందల వంటలు సెర్చ్‌లో కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది కుర్రాళ్లు... బ్యాచిలర్లు... వంటలు చేసుకోవడానికి యూట్యూబ్‌పైనే ఆధారపడుతున్నారు. రోజుకో రకమైన వంటను వీడియోలో చూసి నేర్చుకొని... సరిగ్గా అలాగే చేస్తూ... కొత్త కొత్త వంటలు నేర్చుకుంటున్నారు. ఐతే... ఇప్పుడు మనం చెప్పుకునేందు రెగ్యులర్ వంటల ఛానెల్ కాదు. ఇది పూర్తిగా హాట్ ఛానెల్. పేరు ఎల్లీ ప్రొడక్షన్స్ (alleyproductions) ఇందులో రూప అనే మహిళ రకరకాల వంటలు చేస్తున్నారు.

మిగతా వంటల ఛానెళ్లకూ... ఈ రూప వంటలకూ తేడా ఉంది. ఇది పూర్తిగా విలేజ్ వంటల ఛానెల్. అంటే... ఏ వంట అయినా గ్రామాల్లో... చుట్టూ చెట్లూ, చేమలూ ఉన్న చోట చేస్తారు. వాడే పాత్రలు కూడా పల్లెల్లోని ఇళ్లలో వాడే మట్టి పాత్రలు, కుండలు, దాకల్లో చేస్తారు. ఐతే... ఇలాటి విలేజ్ వంటల ఛానెళ్లు యూట్యూబ్‌లో చాలా ఉన్నా... ఈ ఛానెల్ మాత్రం వాటికి భిన్నమైనది. ఇందులో వంటతోపాటూ... అందాలు ఆరబోస్తోంది రూప.

బెంగాల్ నుంచి రన్ అవుతున్న ఈ ఛానెల్‌ను 2020 ఫిబ్రవరి 10న ప్రారంభించారు. ఇందులో ఇప్పటివరకూ 30 వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకూ 1,95,84,240 వ్యూస్ వచ్చాయి. అంటే ఒక్కో వీడియోకీ యావరేజ్‌గా 6,52,808 వ్యూస్ వచ్చినట్లు లెక్క. సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారన్నది బయటపెట్టలేదు. లక్ష మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. అసలు ఈ ఛానెల్ ఎందుకు పెట్టారో, ఎవరు నడుపుతున్నారో కూడా వివరాలు లేవు.

' isDesktop="true" id="1042420" youtubeid="eLxZ0cJYpgs" category="trending">

ఇందులో రూప అనే మహిళ వంటలు చేస్తోంది. ఓవైపు వంట చేస్తున్నా... మరోవైపు ఆమె అందాలను ఆరారగా వడ్డిస్తోందనే వాదన ఉంది. ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై చాలా మందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆమె నిజంగానే వంట చేస్తోందా... లేక... అందాలు ఆరబోస్తోందా అనే డౌట్ చాలా మందికి ఉంది.

రూప వంట చేస్తోన్న వీడియో : 

' isDesktop="true" id="1042420" youtubeid="t_g59SyIKBg" category="trending">

కూరగాయల వంటలు, చేపలు, చికెన్ ఇలా రకరకాల వంటలు చేస్తోంది రూప. ఓవైపు వంట చేస్తూనే మరోవైపు స్కిన్ షో, ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లు ఉన్నాయి వీడియోలు.రూప చేసే వంటలను వ్యూవర్స్ బాగా లైక్ చేస్తున్నారు. అదిరిపోయింది, సూపర్, టేస్ట్ అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇది కూడా చదవండి : టిక్‌టాక్‌లో మనుషుల ఎముకలు అమ్ముతున్న వ్యక్తి.. నైతిక విలువలపై ఆన్‌లైన్‌లో చర్చ

షీల వంట చేస్తోన్న వీడియో :

' isDesktop="true" id="1042420" youtubeid="Aw65jVio7rU" category="trending">

దీంతో... ఈమధ్యే షీల అనే మరో మహిళను పరిచయం చేశారు. ఆమె కూడా అదే విధంగా వంటలు చేస్తోంది. రూప వీడియోలను ఎలాగైతే నెటిజన్లు లైక్ చేశారో... షీలా వీడియోలనూ అలాగే లైక్ చేస్తున్నారు.మొత్తానికి అటు వంటలు, ఇటు అందాల వడ్డింపులతో ఈ ఛానెల్ దూసుకుపోతోంది. అప్‌లోడ్ చేస్తున్న ప్రతీ వీడియో సూపర్ వైరల్ అవుతోంది.

First published:

Tags: Cooking show, Cooking women, Trending videos, Viral Videos, Youtube

ఉత్తమ కథలు