ఫుట్‌బాల్‌తో యువతి అదిరే పెర్ఫార్మెన్స్... వైరల్ వీడియో...

మనలో టాలెంట్ ఉంటే... దాన్ని నలుగురికీ చూపించాల్సిందే. తద్వారా... టాలెంట్ మరింత పెరుగుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. ఆమె కూడా అదే చేసిందా?

news18-telugu
Updated: May 16, 2020, 9:32 AM IST
ఫుట్‌బాల్‌తో యువతి అదిరే పెర్ఫార్మెన్స్... వైరల్ వీడియో...
ఫుట్‌బాల్‌తో యువతి అదిరే పెర్ఫార్మెన్స్... వైరల్ వీడియో... (credit - twitter )
  • Share this:
ఫుట్‌బాల్ ఆడాలంటే... గ్రౌండే అక్కర్లేదు. నిల్చున్న చోటే... అదిరిపోయేలా పెర్ఫార్మ్ చెయ్యవచ్చని నిరూపించింది ఈ యువతి. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఏదంటే... ఫుట్‌బాలే. ఇండియా సహా చాలా దేశాల్లో ప్రజలు అది ఆడుతారు. ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిందంటే... దీనికి పెద్దగా ఖర్చు ఉండదు. ఓ పెద్ద బంతి ఉంటే చాలు. కొంతమందిని వెంటేసుకొని... గ్రౌండ్‌లో ఇరగదీయొచ్చు. అందుకే అందరికీ ఈ స్పోర్ట్ తెగ నచ్చుతుంది. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడా లేదు. అందరికీ సాకర్ కిక్ ఉంటుంది. చాలా మంది ఫుట్‌బాల్‌పై ప్రేమతో... కొన్ని టెక్నిక్స్, స్కిల్స్ నేర్చుకుంటారు. తమ టాలెంట్‌ని నలుగురి ముందు ప్రదర్శించి... వావ్ అనిపిస్తారు.

ట్విట్టర్ యూజర్ సియూన్ పోస్ట్ చేసిన వీడియోలో యువతి... ఫుట్‌బాల్‌తో... అదరగొట్టింది. ముఖ్యంగా హై హీల్స్‌పై బంతిని దొరిస్తూ... మెస్మరైజ్ చేసింది. తల నుంచి కాళ్ల వరకూ బంతిని అలా అలా పోనిస్తూ... అద్భుతమైన టాలెంట్ చూపించింది. దీన్ని పోస్ట్ చేసిన యూజర్... సాకర్ దిగ్గజాలైన క్రిస్టియానో రొనాల్డో, లయనెల్ మెస్సీలు రెస్పాండ్ అవ్వడానికి 24 గంటల టైమ్ ఇచ్చారు.



ఇంత బాగా చేశాక... ఈ ట్వీట్ వైరల్ అవ్వకుండా ఉండదు కదా. ఇప్పటికే ఒక్క రోజులో దీన్ని 2.96 లక్షల మంది చూశారు. 25 వేల మంది లైక్ చేశారు. వెయ్యి మందికి పైగా కామెంట్స్ రాశారు. 7వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. చాలా మంది ఆ యువతి టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. బంతి కోసం ఆమె కింద కూర్చొని కూడా రకరకాలుగా పెర్ఫార్మెన్స్ చేయడాన్ని మెచ్చుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: May 16, 2020, 9:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading