ప్రపంచంలో అతి పెద్ద పెదవులు గల యువతి ఈమేనా... వైరల్ వీడియో...

ఆమె పెదవులు ఎందుకు అంత పెద్దగా ఉన్నాయన్నది అందరికీ కలిగే డౌటే. 20 ఇంజెక్షన్లు చేయించుకుంటే... అలాగే అవుతాయేమో...

news18-telugu
Updated: May 5, 2020, 2:19 PM IST
ప్రపంచంలో అతి పెద్ద పెదవులు గల యువతి ఈమేనా... వైరల్ వీడియో...
ప్రపంచంలో అతి పెద్ద పెదవులు గల యువతి ఈమేనా... (credit - insta - andrea.andrea345)
  • Share this:
ఆండ్రియా ఇవనోవా... 22 ఏళ్ల ఈ ఇన్‌స్టాగ్రామ్ మోడల్ ఇప్పుడు ప్రపంచాన్ని తన పెదవులతో ఊపేస్తోంది. బల్గేరియాకి చెందిన ఈ బ్యూటీకి మొదట్లో మనందరిలాగే చిన్న పెదవులే ఉండేవి. తన ఫిజిక్‌కీ ఆ పెదవులకూ సెట్ కావట్లేదనుకున్న ఈ అమ్మడు... దాదాపు 20 రౌండ్ల యాసిడ్ లిప్ ఇంజెక్షన్లను చేయించుకుంది. ఫలితంగా ప్రపంచంలో అతి పెద్ద పెదవులు ఈమెకే ఉన్నాయని అంతా అంటున్నారు. మొదట్లో కొన్ని ఇంజెక్షన్ల తర్వాత... కాస్త సైజు పెరిగిన పెదవుల్ని చూపించి... డాక్టర్లు ఆమెకు చెప్పారు... ఈ మాత్రం చాలని. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. ప్రపంచంలో అతి పెద్ద లిప్స్ నాకే ఉండాలని కోరింది. దాంతో డాక్టర్లు (పిచ్చి పలు రకాలు అనుకుంటూ)... 20 రౌండ్ల దాకా ఇంజెక్షన్లు ఇచ్చారు. దాంతో మూతి ఇలా ముందుకొచ్చేసింది.
 View this post on Instagram
 

💖💖😎😎


A post shared by Andrea Ivanova (@andrea.andrea345) on

ఇంతకీ ఈ కోరికకు కారణమేంటంటే... తాను చూడటానికి రియల్ లైఫ్ బార్బీలా ఉండాలని అనుకుందట ఆండ్రియా. లక్షలు ఖర్చు పెట్టి... 2018 నుంచి పెదవుల సైజు పెంచుకుంటూనే ఉంది. ప్రతిసారీ ట్రీట్‌మెంట్‌కి... రూ.12వేలకు పైనే ఖర్చైంది. మొత్తంగా ఎంత ఖర్చైందో తనకే తెలియదని చెప్పింది. 
View this post on Instagram
 

#bg #barbie #lips 💕💖


A post shared by Andrea Ivanova (@andrea.andrea345) on

మరింత పెద్దగా అయ్యే ఛాన్స్ ఉందా అంటే... ఆమె డాక్టర్... డబ్బిస్తే... ఎంత పెద్దవైనా అవుతాయని చెప్పారట... రెండు నెలల తర్వాత 21వ సారి ఇంజెక్షన్ ట్రీట్‌మెంట్ చేస్తామని చెప్పడంతో... అప్పటి వరకూ ఎలా ఆగాలా అని ఆలోచిస్తోందట ఈ పెద్ద మూతి పాప.

మరి ఇంత పెద్ద పెదవులతో ఎలా తింటోంది అన్న డౌట్ వచ్చే ఉంటుంది మీకు. నిజమే... ఇంజెక్షన్ ఇచ్చిన ప్రతిసారీ రెండు, మూడు రోజులు తిండి తినడం ఇబ్బందిగా ఉంటుందట. 
View this post on Instagram
 

#bg #barbie #world #famous #girl


A post shared by Andrea Ivanova (@andrea.andrea345) on

సోషల్ మీడియాలో రోజూ డజన్ల కొద్దీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారట. ఇంత పెద్దవి ఎప్పుడూ చూడలేదు. ఎంత బాగున్నాయో అంటున్నారట. కొంతమందైతే... ప్రపోజ్ కూడా చేసేస్తున్నా్రని తెగ సంబరపడిపోతోంది.

ఈ కామెంట్లలో నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయట. వాటిని మహిళలే చేస్తుండటంతో... తన అందాన్ని చూసి కుళ్లిపోతూ అలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పుకొస్తోంది ఆండ్రియా.
First published: May 5, 2020, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading