రోజూ వేరుశనగ కాయ కోసం ఉడుత వెయిటింగ్... వైరల్ వీడియో

Squirrel Video: ఉడుతలు ఎక్కడా నిలకడగా ఉండవు. కంటిన్యూగా పరుగులు పెడతాయి. అలాంటిది ఆ ఉడుత మాత్రం రోజూ వేరుశనగ కాయ కోసం ఇంటికి వచ్చి వెయిట్ చేస్తోంది.

news18-telugu
Updated: November 11, 2020, 11:53 AM IST
రోజూ వేరుశనగ కాయ కోసం ఉడుత వెయిటింగ్... వైరల్ వీడియో
రోజూ వేరుశనగ కాయ కోసం ఉడుత వెయిటింగ్... వైరల్ వీడియో (credit- youtube)
  • Share this:
Squirrel Video: ఉడుతలు చూడటానికి ఎంతో బాగుంటాయి. చురుగ్గా ఉంటాయి. అవి ఓసారి దొరికితే బాగుండనీ... వాటితో ఆడుకోవాలనీ పిల్లలకు ఉంటుంది. కానీ అవి ఎప్పుడూ మనుషుల దగ్గరకు రావు. కారణం వాటికి మనపై ఉండే భయమే. కానీ ఆ ఉడుత మాత్రం... వేరు శనగ కాయ కోసం... ఓ ఇంటి కిటికీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఉడుతలకు వేరు శనగ గింజలంటే చాలా ఇష్టం. వేరు శనగ కాయను విరగగొట్టి... అందులో పల్లీని తినడాన్ని ఉడుతలు బాగా ఎంజాయ్ చేస్తాయి. అమెరికా... ఒరెగాన్‌లోని... పోర్ట్‌లాండ్‌లో ఓ ఉడుత ఇదే పని చేస్తోంది. ఓ ఇంటికి రోజూ వెళ్లి... కిటికీ దగ్గర సహనంగా ఎదురుచూస్తోంది. కిటికీని టచ్ చేయకుండా అలా అక్కడే ఉంటోంది. ఉడుతను చూసి... ఆ ఇంట్లో వ్యక్తి... ఓ వేరుశనగ కాయ ఇవ్వగానే... దాన్ని అపురూపంగా తీసుకొని... తుర్రున పారిపోతోంది.

గుడ్ మార్నింగ్... నీకు మరో పీనట్ (పల్లి) కావాలా అని వీడియోలో వ్యక్తి అడుగుతూ... పీనట్ ఇస్తుంటే... ఆ ఉడుతలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


కొన్ని రోజుల కిందట ఇలాంటిదే మరో వీడియో తెరపైకి వచ్చింది. అందులో ఉడుత... దాహం వేసి... నీరు కావాలని టూరిస్టులనే అడిగింది. ఆ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి సుశాంత నందా పోస్ట్ చేశారు. అది కూడా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో... తనకు వాటర్ కావాలని ఉడుత అలా అడగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వాటర్ బాటిల్ చూడగానే... "నాకు నాకు నాకు కావాలి" అంటున్నట్లుగా ఆ ఉడుత తన రెండు ముందు కాళ్లతో సైగలు చేసింది. ఉడుతను చూసిన ఓ మహిళ... "దానికి దాహంగా ఉంది... వాటర్ పట్టరాదూ" అని అనడంతో... పక్కనే ఉన్న వ్యక్తి... వెంటనే బాటిల్ ఓపెన్ చేసి... ఉడుత నోటి దగ్గర పెట్టి... దాహం తీర్చాడు. నీరు తాగాక... ఆ ఉడుత ఆనందంగా వెళ్లిపోయింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వీడియోలు... ఎంతో మనోరంజకాన్ని అందిస్తున్నాయి. చాలా మంది వీటిని చూసి... మనసుకు హాయిగా ఉందంటున్నారు. కాసేపైనా తమ కష్టాలు మర్చిపోయాం అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: November 11, 2020, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading