Viral Video: అమ్మ బాబోయ్.. అది దిష్టిబొమ్మా.. దయ్యమా..! వైరల్ గా మారిన వీడియో..

దయ్యంలా కినిపించే దిష్టిబొమ్మ (image credit : twitter)

ఒక దిష్టిబొమ్మకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాను షేక్​ చేస్తుంది. ట్విట్లర్​లో షేర్​ అయిన ఈ చిన్న క్లిప్​ ఎక్కువ మంది నెటిజన్లను ఆకట్టుకోంది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఏంటో తెలియాలంటే..పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.

  • Share this:
సోషల్​ మీడియా విస్తృతితో అనేక వింతలు, విశేషాలు క్షణాల్లో మన కళ్ల ముందుంటున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు సరదాగా, ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయబ్రాంతులకు గురిచేస్తూ హడలెత్తిస్తుంటాయి. తాజాగా అటువంటి భయంకరమైన వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. ఒక దిష్టిబొమ్మకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాను షేక్​ చేస్తుంది. ట్విట్లర్​లో షేర్​ అయిన ఈ చిన్న క్లిప్​ ఎక్కువ మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలు ఈ క్లిప్​లో ఏముంది? ఎందుకు ఇంత వైరల్​ అవుతుందో చూద్దాం. సాధారణంగా పక్షులు, అడవి జంతువుల నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. వాటిని చూసి పక్షులు, జంతువులు భయపడి పంట పొలాల్లోకి రాకుండా ఉంటాయని రైతులు విశ్వసిస్తారు. అందుకే అక్కడక్కడా దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వైరల్​ అవుతున్న వీడియో కూడా పంట పొలాల్లో ఏర్పాటు చేసిందే. అయితే ఈ దిష్టి బొమ్మను భయంకరంగా రూపొందించారు. దీన్ని ఎవరూ ఊహించని రీతిలో తయారు చేశారు. నిటారుగా ఉన్న ఒక స్ప్రింగ్​కు బైక్​ హ్యాండిల్​ తగిలించి.. ఆ హ్యాండిల్​ను దిష్టిబొమ్మ పట్టుకునేలా ఏర్పాటు చేశారు.

భయంకరమైన మొహం, తలపై ఎర్ర కండువా, చొక్కా, లంగా ధరింపజేసి దిష్టిబొమ్మను ఒక దెయ్యం మాదిరిగా తయారు చేశారు. స్ప్రింగ్​ యాక్షన్ ఉన్న కర్రను దిష్టిబొమ్మ పట్టుకున్నట్లుగా ఏర్పాటు చేయడంతో అది పైకి కిందికి ఊగుతోంది. ఇది చూడటానికి అచ్చం దెయ్యం ఊగుతున్నట్లు కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఎవరైనా దీన్ని చూస్తే భయంతో గుండె ఆగిపోవడం ఖాయమనే చెప్పాలి.


వైరల్​గా మారిన వీడియో..
ఈ భయంకరమైన దిష్టిబొమ్మకు సంబంధించిన 9 సెకన్ల వీడియో సోషల్​ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 70 వేల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు ఈ దెయ్యం బొమ్మను చూసి హడలెత్తిపోతున్నారు. రాత్రి పూట ఈ బొమ్మను చూస్తే గుండె ఆగిపోవడం ఖాయమంటూ కొంతమంది కామెంట్​ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇది నెక్ట్స్​ లెవల్​ దిష్టిబొమ్మ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఈ దిష్టిబొమ్మను చూస్తే జంతువులు, పక్షులే కాదు.. మనుషులు కూడా ఆ వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్లేందుకు సాహసించరని నెటిజన్లు వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.
Published by:Veera Babu
First published: