Gyro Drop : అది ఫేక్ వీడియో... భలే నమ్మిస్తున్నారుగా...

Gyro Drop Amusement Park Ride : గైరో డ్రాప్ పేరుతో ట్విట్టర్‌లో ఓ వీడియో ట్వీట్ వైరల్ అయ్యింది. కానీ అది నిజమైన వీడియో కాదని తేలిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 5:49 AM IST
Gyro Drop : అది ఫేక్ వీడియో... భలే నమ్మిస్తున్నారుగా...
ఫేక్ వైరల్ వీడియో (Image : Twitter / dweena
  • Share this:
గైరో డ్రాప్ అనేది నిజంగానే ఉన్న అమ్యూజ్‌మెంట్ పార్క్ రైడ్. ఐతే... గైరో డ్రాప్ పేరుతో జూన్‌లో వచ్చిన వీడియో మాత్రం ఫేక్ అని తేలింది. ఆ వీడియోలోని గైరో డ్రాప్‌లో టూరిస్టులు ఒక్కసారిగా గాల్లోకి జారిపోతున్నట్లు, గాల్లో గింగిర్లు తిరుగుతున్నట్లు రకరకాలుగా చూపించారు. ఆ వీడియో చూసిన వాళ్లంతా... అమ్మో... ఇలాంటి రైడ్ మనం చెయ్యలేం.... గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి... అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు. అసలు విషయమేంటంటే... గైరో డ్రాప్ నిజంగానే ఉంది కానీ... దానిపై రైడ్ మాత్రం అలా లేదు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో చేసిన మాయాజాలం ఆ వీడియో. నిజమైన గైరో డ్రాప్ దక్షిణ కొరియాలోని లొట్టె వరల్డ్‌లో ఉంది. ఆ ఫేక్ వీడియో మీరూ చూడండి.



చూశారుగా... ఇలాంటి రైడ్ ప్రాణాలకే ప్రమాదం. నిజమైన గైరో డ్రాప్ 40 మందిని 230 అడుగుల ఎత్తుకు తీసుకెళ్తుంది. తిరిగి వాళ్లను కిందికి తెచ్చేటప్పుడు మాత్రం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తెస్తుంది. అయినప్పటికీ అది ప్రాణాంతకంగా ఉండదు. అందువల్లే సౌత్ కొరియాలో ఈ రైడ్‌కి మంచి గుర్తింపు ఉంది. ఈ కింది వీడియోలో నిజమైన గైరో డ్రాప్‌ని చూడొచ్చు.
ఇంతకీ ఆ ఫేక్ వీడియో ఎవరు తయారుచేశారన్నది తేలలేదు. సాధారణంగా... 2012లో టిల్ నొవాక్... ది సెంట్రిఫ్యూజ్ బ్రెయిన్ ప్రాజెక్టు కోసం కొన్ని డూప్లికేట్ రైడ్లను కంప్యూటర్లలో సృష్టించారు.



ఈ కొత్త వీడియో కూడా వాళ్లే సృష్టించారా అన్న అనుమానాలున్నాయి. కొంతమంది మాత్రం లొట్టె వరల్డ్ మేనేజ్‌మెంటే ఆ ఫేక్ వీడియోను రిలీజ్ చేసి ఉంటుందని అంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :

రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇవీ ప్రయోజనాలు...


టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే కచ్చితంగా తింటారు...

First published: June 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading